అమరవీరుడి కుమార్తెకు అండగా మోహన్‌బాబు

Mohan Babu Provides Free Education For Army Jawan Children  - Sakshi

బాధిత కుటుంబానికి హామీ ఇచ్చిన మోహన్‌బాబు

సాక్షి, హైదరాబాద్‌: భారతసైన్యంలో వీరమరణం పొందిన ఓ హవల్దార్‌ కుమార్తెకు శ్రీ విద్యానికేతన్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డా.మోహన్‌బాబు ఉచిత విద్య అందించనున్నారు. చిత్తూరు జిల్లా రెడ్డివారిపల్లి గ్రామానికి చెందిన సీహెచ్‌ ప్రవీణ్‌ కుమార్‌ (36) గతేడాది నవంబరు 8న ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో వీరమరణం పొందాడు.

ప్రవీణ్‌కుమార్‌ కుమార్తె సీహెచ్‌ లోహితకు ఈ విద్యా సంవత్సరం 4వ తరగతి నుంచి ఉచితవిద్య అందించనున్నట్లు మోహన్‌బాబు తెలిపారు. ఈ మేరకు బాధిత కుటుంబాన్ని కలిసి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా శ్రీ విద్యానికేతన్‌ విద్యా సంస్థల సీఈవో మంచు విష్ణుకు ప్రవీణ్‌కుమార్‌ భార్య కృతజ్ఞతలు తెలిపారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top