breaking news
Srividyaniketan school
-
అమరవీరుడి కుమార్తెకు అండగా మోహన్‌బాబు
సాక్షి, హైదరాబాద్: భారతసైన్యంలో వీరమరణం పొందిన ఓ హవల్దార్ కుమార్తెకు శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థల చైర్మన్ డా.మోహన్‌బాబు ఉచిత విద్య అందించనున్నారు. చిత్తూరు జిల్లా రెడ్డివారిపల్లి గ్రామానికి చెందిన సీహెచ్ ప్రవీణ్ కుమార్ (36) గతేడాది నవంబరు 8న ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో వీరమరణం పొందాడు. ప్రవీణ్‌కుమార్ కుమార్తె సీహెచ్ లోహితకు ఈ విద్యా సంవత్సరం 4వ తరగతి నుంచి ఉచితవిద్య అందించనున్నట్లు మోహన్‌బాబు తెలిపారు. ఈ మేరకు బాధిత కుటుంబాన్ని కలిసి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థల సీఈవో మంచు విష్ణుకు ప్రవీణ్‌కుమార్ భార్య కృతజ్ఞతలు తెలిపారు. -
జీవితంలో విద్యార్థి దశ కీలకం
సినీ నటి మంచు లక్ష్మి ఘట్కేసర్: జీవితంలో విద్యార్థి దశ అత్యంత కీలకమైనదని ప్రముఖ సినీ నటి మంచు లక్ష్మి పేర్కొన్నారు. మండల పరిధిలోని పోచారం సంస్కృతి టౌన్‌షిప్‌లోని శ్రీవిద్యానికేతన్ పాఠశాలలో సోమవారం నిర్వహించిన రిపబ్లిక్ డే, స్పోర్ట్స్ డే వేడుకలకు అమె ముఖ్యఅతిథిగా హాజరయ్యూరు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చిన్నారులు ఇప్పటి నుంచే ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని అందుకోసం కృషి చేయూలని సూచించారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి యోగా వంటివి నేర్చుకోవాలన్నారు. ఆటపాటలతోపాటు చదువును విస్మరించరాదన్నారు. ఈ సందర్భంగా ఆమె బాల్య స్మృతులను నెవురువేసుకున్నారు. అనంతరం నిర్వహించిన క్రీడా పోటీల విజేతలకు బహువుతులు అందజేశారు. కార్యక్రమంలో ఆనంద్ శ్రీనివాస్, ప్రిన్సిపాల్ భవాని, ఏఓ హేమచంద్ర, కాంగ్రెస్ నాయకుడు సింగిరెడ్డి, రాంరెడ్డి, సంస్కృతి టౌన్షిప్ అధ్యక్షుడు హరిప్రసాద్, కాలనీ ఉపాధ్యక్షుడు మెట్టు నర్సింహారెడ్డి, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.