Megastar Chiranjeevi Announces His Grand Daughter Name - Sakshi
Sakshi News home page

Mega Princess Name: మనవరాలి పేరు చెప్పేసిన మెగాస్టార్..!

Jun 30 2023 4:16 PM | Updated on Jun 30 2023 6:30 PM

Megastar Revealed Ram Charan -Upasana Daughter Name - Sakshi

గ్లోబల్‌ స్టార్ రామ్ చరణ్ – ఉపాసన దంపతులు తల్లిదండ్రులు అయినరోజు నుంచి మెగాఫ్యామిలీ వార్తల్లో నిలుస్తూనే ఉంది. కొణిదెల వారి ఇంట ఈనెల 20న మెగా ప్రిన్సెస్ అడుగుపెట్టింది. దీంతో మెగా ఇంట నేటివరకు కూడా సంబరాలు జరుగుతూనే ఉన్నాయి. పాప పుట్టినరోజు నుంచి ఇటు మీడియాలో.. అటు సోషల్ మీడియాలో ఏ పేరు పెట్టబోతున్నారనే చర్చ నడుస్తూనే  ఉంది. 

తాజాగా మనవరాలి పేరును చిరంజీవి ట్వీట్ చేశారు. మా ఇంటి మహాలక్ష్మి పేరు 'క్లీంకార కొణిదెల'(Klin Kara Konidela) అంటూ  పోస్ట్ చేశారు.  ఈ మేరకు ఓ ఫోటోను మెగాస్టార్ ట్విటర్‌లో పోస్ట్ చేస్తూ మనవరాలి పేరును వెల్లడించారు. ఆ ఫోటోలో చిరంజీవి దంపతులు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరలవుతోంది. 

Advertisement
 
Advertisement
Advertisement