
మంచు లక్ష్మి (Manchu Lakshmi) సుమారు ఐదేళ్ల తర్వాత వెండితెరపై కనిపించనుంది. తను ప్రధాన పాత్రలో నటించిన దక్ష (ది డెడ్లీ కాన్సిఫరిసీ) చిత్రం నుంచి తాజాగా టీజర్‌ను విడుదల చేశారు. వారి సొంత బ్యానర్ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్‌లో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. నిర్మాతలుగా మోహన్ బాబు, లక్ష్మీ ప్రసన్న ఉన్నారు. దర్శకుడు వంశీకృష్ణ మల్ల ఈ సినిమాను యాక్షన్, క్రైమ్ థ్రిల్లర్‌గా ప్రేక్షకులకు చూపించనున్నారు. ఇందులో సముద్రఖని, మలయాళ నటుడు సిద్దిక్, చైత్ర శుక్ల వంటి వారు నటించగా మోహన్ బాబు కూడా ఒక ప్రధాన పాత్రలో కనిపించనున్నారు.

సుమారు నాలుగేళ్ల క్రితమే అగ్ని నక్షత్రం (Agni Nakshatram) పేరుతో మంచు లక్ష్మి ఈ చిత్రాన్ని ప్రకటించారు. అయితే, ఇప్పుడు ఇదే సినిమాను 'దక్ష'గా టైటిల్ మార్చి విడుదల చేస్తున్నారు. తాజాగా విడుదలైన టీజర్ మెప్పించేలా ఉంది. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా మంచు లక్ష్మీ పవర్‌పుల్ పాత్రలో కనిపించారు. యాక్షన్ సీన్స్‌లలో ఆమె అదర గొట్టిందనే చెప్పాలి. సెప్టెంబర్ 19న ఈ చిత్రం విడుదల కానుంది. లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ నుంచి పదేళ్ల తర్వాత దక్ష రూపంలో మరో చిత్రం విడుదల కానుంది. 2015లో మామ మంచు అల్లుడు కంచు మూవీ ఆ బ్యానర్ నుంచి చివరిగా విడుదలైంది.