
నటీమణులు పబ్లిసిటీ కోసం ఎలాంటి సందర్భాలను వదులుకోవడం లేదు. ఇందుకు నటి మాళవిక మోహన్ అతీతం కాదు. ఈ మలయాళి భామ మాతృభాషతో పాటు తమిళం, కన్నడం, హిందీ, ఆంగ్లం తదితర భాషల్లో వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకునే ప్రయత్నాల్లో ఉంది. 2013లో నటిగా రంగ ప్రవేశం చేసిన ఈ బ్యూటీ మలయాళ ప్రముఖ చాయాగ్రహకుడు మోహన్ వారసురాలన్న విషయం తెలిసిందే.
చదవండి: మిస్ యూ నానమ్మ.. నువ్వు మళ్లీ తిరిగి రావాలి..: సితార ఎమోషనల్ పోస్ట్
రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన పేట చిత్రం ద్వారా కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రంలో శశికుమార్‌కు జంటగా కీలకపాత్ర పోషించి గుర్తింపు తెచ్చుకుంది. అయితే మజిద్ దర్శకత్వం వహించిన బి యీండ్ ది క్లౌడ్స్ చిత్రంలో నటిగా మాళవిక మోహన్ మరింత పేరు తెచ్చుకుంది. ఆ తరువాత తమిళంలో విజయ్ సరసన మాస్టర్ చిత్రంలో హీరోయిన్‌గా నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఆ చిత్ర సక్సెస్‌తో ధనుష్‌కు జంటగా మారన్ చిత్రంలో నాయికగా నటించే అవకాశం వరించింది. అయితే ఆ చిత్రం థియేటర్లలో కాకుండా ఓటీటీలో స్ట్రీమింగ్ అయింది.
చదవండి: కోర్టు ధిక్కరణ? నిర్మాత ఎక్తాకపూర్, ఆమె తల్లికి బిహార్ కోర్టు షాక్!
ఆ తరువాత ఈ అమ్మడు కోలీవుడ్‌లో మళ్లీ కనిపించలేదు. అదే విధంగా ఇప్పటికీ స్టార్ ఇమేజ్‌ను అందుకోలేకపోయింది. అయితే సామాజిక మాధ్యమాల్లో తరచూ కవ్వించే ఫొటోలతో దర్శనమిస్తునే ఉంది. తాజాగా నవరాత్రి ఫొటో షూట్ పేరుతో వివిధ భంగిమల్లో దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. అది ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. కాగా మాళవిక మోహన్ ప్రస్తుతం మలయాళంలో ఒక చిత్రం చేస్తోంది. తమిళంలో అవకాశాల కోసం ఎదురు చూస్తోంది.