Mahesh Babu Shares His Photo On The Peacock Magazine - Sakshi
Sakshi News home page

Mahesh Babu: ‘ద పీకాక్‌’ మ్యాగజైన్‌పై మహేశ్‌, ఫొటో షేర్‌ చేసిన సూపర్‌ స్టార్‌

May 11 2022 8:47 AM | Updated on May 11 2022 10:29 AM

Mahesh Babu Shares His Photo On The Peacock Magazine - Sakshi

Mahesh Babu Stuns On The Peacock Magazine:  సూపర్ స్టార్‌ మహేశ్‌ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు. పరశురామ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 12న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో మహేశ్‌ వరుస ఇంటర్య్వూలు, ప్రెస్‌మీట్‌లతో బిజీ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో సోమవారం ప్రముఖ మ్యాగజైన్‌ కవర్‌ పేజీపై కనిపించి తన ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్‌ చేశారు ఆయన. ద పీకాక్‌ మేగజీన్‌ కవర్‌ పేజీ కోసం ఆయన ఇటీవల ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. ఈ విషయాన్ని మహేశ్‌ స్వయంగా తెలిపారు.

చదవండి: మహేశ్‌-రాజమౌళి మూవీపై అప్‌డేట్‌ ఇచ్చిన రచయిత విజయేంద్ర ప్రసాద్‌

మ్యాగజైన్‌ కవర్‌ పేజీపై ప్రచురించిన తన ఫొటోను ట్విటర్‌లో షేర్‌ చేస్తూ ద పీకాక్‌ మ్యాగజైన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ మ్యాగజైన్‌ కోసం జరిగిన ఫొటోషూట్‌ మొత్తం చాలా సరదాగా, ఉల్లాసంగా జరిగిందని ఈ సందర్భంగా మహేశ్‌ పేర్కొన్నారు. ఆ షూట్‌ కోసం కష్టపడ్డ ద పీకాక్‌ మ్యాగజైన్‌ జర్నలిస్టులు ఫాల్గుణి, షేన్‌లకు మహేశ్‌ స్పెషల్‌గా థ్యాంక్స్‌ చెప్పారు. కాగా ద పీకాక్‌ మ్యాగజైన్‌పై మహేశ్‌తో పాటు టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత కూడా కనిపించిన సంగతి తెలిసిందే. ఇటీవల ఇందుకోసం ఇచ్చిన ఫొటోషూట్‌ను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement