Mahesh Babu: అందుకు నాకు అర్హత లేదు: మహేశ్‌ బాబు

Mahesh Babu Praises Kamal Haasan Vikram Movie - Sakshi

ఉలగ నాయగన్‌ (లోక నాయకుడు) కమల్ హాసన్ సూపర్‌ హిట్‌ కమ్‌బ్యాక్‌ ఇచ్చిన చిత్రం 'విక్రమ్‌'. లోకేష్ కనకరాజ్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్‌గా మారింది. జూన్‌ 3న విడుదలై సక్సెస్ సాధించడమే కాకుండా జులై 8 నుంచి డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌కు సిద్ధంగా ఉంది. రూ. 400 కోట్లకుపైగా వసూళ్లు కొల్లగొట్టిన 'విక్రమ్‌' సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంటోంది. తాజాగా ఈ మూవీపై టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు పొగడ్తల వర్షం కురిపించాడు. ఇప్పటి సినిమాల్లో న్యూ ఏజ్‌ కల్ట్‌ క్లాసిక్‌ మూవీగా అభివర్ణించాడు. 

'విక్రమ్‌ బ్లాక్‌బస్టర్ సినిమా. ఒక న్యూ ఏజ్ కల్ట్ క్లాసిక్ చిత్రం. లోకేశ్ కనకరాజ్.. నేను మిమ్మల్ని కలిసి విక్రమ్‌ మూవీ ప్రారంభం నుంచి చివరి వరకు షూటింగ్ ఎలా జరిగిందో తెలుసుకోవాలని ఉంది. విజయ్‌ సేతుపతి, ఫహాద్‌ ఫాజిల్ తమ అద్భుతమైన నటనతో మెరిపించేశారు. అనిరుధ్‌ బెస్ట్ మ్యూజిక్ అందించాడు. చాలాకాలం తర్వాత నా ప్లే లిస్ట్‌ టాప్‌లో విక్రమ్‌ ఉంది. ఇక చివరిగా లెజెండ్‌ కమల్‌ హాసన్‌ నటన గురించి చెప్పేందుకు నాకు అర్హత లేదు. ఒక అభిమానిగా చాలా గర్వంగా ఉంది.  మీకు, మీ అద్భుతమైన బృందానికి శుభాకాంక్షలు.' అని మహేశ్‌ బాబు ట్వీట్‌ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. 

చదవండి: ఫ్రెండ్‌తో బెడ్‌ షేర్‌.. అబార్షన్‌.. ఎలాంటి పశ్చాత్తాపం లేదు: నటి
3 సార్లు పెళ్లి వరకు.. దేవుడు దయతో బయటపడ్డ: స్టార్‌ హీరోయిన్‌

 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top