Who Is Vikaram Movie Agent Tina: విలన్స్‌తో ఫైట్‌ చేసిన ఈ పని మనిషి ఎవరో తెలుసా?

Who Is Agent Tina In Vikram Movie Here Is Details - Sakshi

‘లోక నాయకుడు’ కమల్‌ హాసన్‌ విక్రమ్‌ మూవీ ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నాలుగేళ్లుగా ఒక్క హిట్‌ లేని కమల్‌కు ఈ మూవీ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందించింది. విడుదలైన రెండు వారాల్లోనే ఈ మూవీ రూ. 300 కోట్లు వసూళు చేసింది. ప్రస్తుతం మూవీ టీం విక్రమ్‌ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ను ఆస్వాధిస్తోంది. లోకేశ్‌ కనగరాజు దర్శకత్వంతో తెరకెక్కిన ఈ చిత్రంలో మలయాళం స్టార్‌ హీరో ఫాహద్‌ ఫాజిల్‌, కోలీవుడ్‌ స్టార్స్‌ విజయ్‌ సేతుపతి ప్రధాన పాత్రలు పోషించగా..  సూర్యలు కీ రోల్‌లో కనిపించాడు.

చదవండి: లారెన్స్‌ బిష్ణోయ్‌ ముఠా హిట్‌ లిస్ట్‌లో కరణ్‌ జోహార్‌..

ఇక ఇదిలా ఉంటే ఈ మూవీ పని మనిషిగా కనిపించిన ఎజెంట్‌ టీనా పాత్ర ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. ఇందులో ఆమె విలన్‌ గ్యాంగ్‌పైకి శివంగిలా విరుచుకుపడి వారికి చెమటలు పట్టించింది. దీంతో సినిమా అనంతరం చాలామంది పని మనిషి ఎజెంట్‌ టీనా గురించే చర్చించుకుంటున్నారు. ఇంతకి ఆమె ఎవరా? అని అందరు ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో ఆమెకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. ఇంతకి ఎజెంట్‌ టీనా అసలు పేరు ఎంటంటే వాసంతి. కోలీవుడ్ ప్రముఖ డాన్స్‌ కోరియోగ్రాఫర్‌లో ఆమె ఒకరు. తమిళంలో ఎంతోమంది స్టార్‌ హీరోల సినిమాలకు ఆమె కోరియోగ్రఫి అందించింది. 

ఈ క్రమంలో విక్రమ్‌ మూవీతో ఆమె నటిగా వెండితెరకు పరిచయమైంది. తొలి సినిమాతోనే ఆమెకు మంచి గుర్తింపు రావడంతో మురిసిపోతూ డైరెక్టర్‌ లోకేశ్‌ కనగరాజుకు  సోషల్‌ మీడియా వేదికగా ధన్యవాదాలు తెలిపింది. ఈ సందర్భంగా ఆమె ట్వీట్‌ చేస్తూ..‘విక్రమ్‌ వంటి ప్రాజెక్ట్‌లో తాను భాగస్వామ్యం అయినందుకు గర్వంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన  డైరెక్టర్‌ లోకేశ్‌ కనగరాజు గారికి కృతజ్ఞతలు. నా అసలు పేరు వాసంతి. కానీ అందరూ నన్ను ఎజెంట్‌ టీనా అని పిలుస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ప్రేక్షకులంత నన్ను టీనాగా గుర్తిస్తున్నారు’ అంటూ రాసుకొచ్చింది. కాగా విక్రమ్‌ మూవీలో హీరో మీద పగతో ఆయన తనయుడిని విలన్‌లు చంపేస్తారు.  

చదవండి: 16 రోజుల్లో రూ. 300 కోట్లు.. బాహుబలి 2 రికార్డు బద్దలు..

దీంతో విక్రమ్‌ కోడలు ఆయనని ద్వేషిస్తూ కొడుకుతో ఒంటరిగా ఉంటుంది. అయితే కోడలికి, మనవడికి తోడుగా ఒక పనిమనిషి ఉంటుంది. విక్రమ్ ఫ్యామిలీపై పగతీర్చుకోవడానికిగాను వారిపై విలన్ అనుచరులు దాడికి యత్నిస్తారు. అయితే పని మనిషి విక్రమ్ సార్‌కి కాల్ చేయమని ఎంతగా చెప్పినా ఆయనపై సరైన అభిప్రాయం లేని కారణంగా కోడలు ఆ మాటలు పట్టించుకోదు. అప్పుడు విలన్ గ్యాంగ్పైకి ఆ పని మనిషి ఒక్కసారిగా విరుచుకుపడుతుంది. అయితే చివరిలో ఆమె 'ఏజెంట్ టీనా' అనీ.. కోడలు, మనవడికి రక్షణ ఆమెను హీరో ఆ ఇంటికి పనిమనిషిగా పింపించాడనే విషయాన్ని దర్శకుడు రివీల్ చేస్తాడు. సస్పెన్స్‌తో  ముడిపడిన ఈ సీన్‌ సినిమాలోని యాక్షన్‌ సీన్స్‌లో ఒకటిగా నిలిచింది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top