విహార యాత్రకు మహేష్‌ బాబు ఫ్యామిలీ | Mahesh Babu Goes On Vacation With Family, Spotted At Airport | Sakshi
Sakshi News home page

ఎయిర్‌పోర్టులో మ‌హేశ్ ఫ్యామిలీ

Nov 8 2020 3:47 PM | Updated on Nov 8 2020 4:23 PM

Mahesh Babu Goes On Vacation With Family, Spotted At Airport - Sakshi

ఎంత పెద్ద హీరోలైనా రోజులు గ‌డిచే కొద్దీ వ‌య‌సు మీద ప‌డుతూనే ఉంటుంది. కానీ సూప‌ర్ స్టార్ మ‌హేశ్‌బాబు ఏజ్ మాత్రం రివ‌ర్స్ గేర్‌లో వెళుతుంద‌ని అనిపిస్తోంది. ఇందుకు ఆయ‌న తాజాగా సోష‌ల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోనే నిద‌ర్శ‌నం. కొడుకు గౌత‌మ్‌, కూతురు సితార‌తో క‌లిసి విమానాశ్ర‌యంలో క‌నిపించిన‌ మ‌హేశ్‌.. వారికి తండ్రిలా కాకుండా సోద‌రుడిలా క‌నిపించ‌డం విశేషం. క‌రోనాను దృష్టిలో పెట్టుకుని జాగ్ర‌త్త‌లు పాటిస్తూనే తిరిగి సాధారణ జీవ‌నం గ‌డిపేందుకు మ‌హేశ్ కుటుంబంతో క‌లిసి విహార‌యాత్ర‌కు వెళ్తున్నారు. అందులో భాగంగా మ‌హేశ్ కుటుంబం అంతా ఫేస్ మాస్కులు ధ‌రించి ఎయిర్‌పోర్ట్‌లో ద‌ర్శ‌నమిచ్చారు. (చ‌ద‌వండి: పెళ్లి ఫొటో షేర్‌ చేసిన నమ్రత...)

ఈ సంద‌ర్భంగా మ‌హేశ్ సైతం పిల్ల‌ల‌తో క‌లిసి దిగిన సెల్ఫీని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. అయితే వీరు విహారానికి అమెరికా వెళ్తున్న‌ట్లు స‌మాచారం. కాగా క‌రోనా కార‌ణంగా విధించిన లాక్‌డౌన్ వ‌ల్ల ఈ సూప‌ర్ స్టార్ కుటుంబం ఎనిమిది నెల‌లుగా బ‌య‌ట ప్ర‌దేశాల‌కు వెళ్ల‌కుండా ఇంటికే ప‌రిమిత‌మైంది. మ‌రోవైపు త్వ‌ర‌లోనే "స‌ర్కారు వారి పాట" సినిమా చిత్రీక‌ర‌ణ ప్రారంభం కానుంది. దీంతో హీరో.. ఈ చిన్న బ్రేక్‌లో పెద్ద‌ వినోదాన్ని ప్లాన్ చేశారు. అయితే హాలీడే ట్రిప్ ముగియ‌గానే టంచ‌నుగా సెట్స్‌లో అడుగుపెట్ట‌నున్నారు. ఇక "స‌ర్కారు వారి పాట" సినిమాలో మ‌హేశ్ స‌ర‌స‌న హీరోయిన్‌ కీర్తి సురేశ్ జోడీ న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క‌మ‌ర్షియ‌ల్ మ‌సాలా ఎంట‌ర్‌టైన‌ర్‌ను ద‌ర్శ‌కుడు ప‌రశురామ్ తెరకెక్కిస్తున్నారు.(చ‌ద‌వండి: వ్యవసాయం చేస్తున్న తైమూర్‌, సైఫ్‌)

Advertisement
 
Advertisement
Advertisement