పెళ్లి ఫొటో షేర్‌ చేసిన నమ్రత... | Namrata Shirodkar Shares Her Marriage Photo With Her Parents | Sakshi
Sakshi News home page

పెళ్లి ఫొటో షేర్‌ చేసిన నమ్రత...

Nov 3 2020 8:22 PM | Updated on Nov 3 2020 8:26 PM

Namrata Shirodkar Shares Her Marriage Photo With Her Parents - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ ప్రిన్స్‌ మహేష్‌ బాబు సతిమణి నమ్రతా శిరోద్కర్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో తాజాగా షేర్‌‌ చేసిన పోస్ట్‌ నెటిజన్‌లను తెగ ఆకట్టుకుంటోంది. వారి పెళ్లి ఫొటోను మంగళవారం షేర్‌ చేసి ప్రిన్స్‌ అభిమానులను ఆశ్చర్యపరిచారు. పెళ్లి అనంతరం ఇరువురి తల్లిదండ్రులతో కలిసి నమ్రత-మహేష్‌లు తీసుకున్న ఫొటోతో పాటు నమ్రత తల్లిదండ్రుల పెళ్లినాటి ఫొటోను కూడా జత చేసి నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ‘అప్పటికి ఇప్పటి పర్ఫెక్ట్‌ పిక్చర్‌. అసాధారణమైన యాధృచ్చికం. స్వర్గంలో నిర్ణయించిన వివాహలు’ అనే క్యాప్షన్‌కు‌ కళ్లల్లో హార్ట్ ఉండే మూడు‌ ఎమోజీలను జత చేశారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే కేవలం కుటుంబ సభ్యుల మధ్య నిరాండబరంగా  మహేష్‌-నమ్రతల వివాహం జరిగిన విషయం తెలిసిందే. (చదవండి: పంచెక‌ట్టు, మీసంతో మ‌హేశ్‌బాబు న్యూ లుక్‌!)

దీంతో ఈ స్టార్‌ జంట పెళ్లి చూసే అవకాశం అభిమానులకు దొరకలేదు. ఆ తర్వాత కొన్ని సందర్భాల్లో మాత్రమే మహేష్-నమ్రతల‌ పెళ్లి ఫొటోలు చూసే అవకాశం వచ్చింది. ఈ నేపథ్యంలో తమ పెళ్లి ఫొటోను షేర్‌ చేయడంపై అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రిన్స్‌ మహేష్‌ బాబును పెళ్లి కొడుకుగా మరోసారి చూసే అవకాశం ఇచ్చినందుకు అభిమానులు నమ్రతకు ధన్యవాదాలు తెలుపుతున్నారు. అయితే వంశీ సినిమాలో  నటించిన నమ్రత, మహేష్‌లు ఈ చిత్రం షూటింగ్‌‌ సమయంలో ప్రేమలో పడ్డారు. ఈ క్రమంలో 2005లో వీరు గుట్టుచప్పుడుగా ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వీరికి గౌతమ్‌ బాబు, సితార ఇద్దరూ పిల్లలు ఉన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement