మ‌హేశ్ కృత్రిమ మీసం‌పై న‌మ్ర‌త కామెంట్ | Mahesh Babu Moustache Look For An Ad, Namrata Shares Pic | Sakshi
Sakshi News home page

పంచెక‌ట్టు, మీసంతో మ‌హేశ్‌బాబు న్యూ లుక్‌!

Oct 28 2020 7:15 PM | Updated on Oct 28 2020 7:28 PM

Mahesh Babu Moustache Look For An Ad, Namrata Shares Pic - Sakshi

న‌ల‌భై ఐదేళ్ల‌ వ‌య‌సులోనూ ఇర‌వై ఏళ్ల కుర్రాడిలా క‌నిపించ‌డం ఒక్క మ‌హేశ్‌బాబుకే చెల్లుతుంది. పిల్ల‌లతో క‌లిసి ఫొటో దిగితే మ‌హేశ్‌ వాళ్ల‌కు తండ్రిలా కాకుండా సోద‌రుడిలా క‌నిపిస్తారు. అలా వ‌య‌సుతో సంబంధం లేకుండా త‌న త‌న‌ అందాన్ని రోజురోజుకీ పెంచుకుంటూ పోతున్నారు. అయితే ఎప్పుడూ స్మార్ట్‌గా యంగ్ లుక్‌లో క‌నిపించే మ‌హేశ్ ఈసారి పంచెక‌ట్టులో మీసంతో క‌నిపించారు. ఓ యాడ్ చిత్రీక‌ర‌ణ‌ కోసం ఆయ‌న మీస‌క‌ట్టుతో రెడీ అయ్యారు. ఈ లుక్‌లో కూడా మీరు అదిరిపోయారు సూప‌ర్ స్టార్ అంటూ ఆయ‌న అభిమానులు పొగ‌డ్తల వ‌ర్షం కురిపిస్తున్నారు. (చ‌ద‌వండి:మ‌రో ఇద్ద‌రికి ప్రాణదానం చేసిన మ‌హేశ్‌)

ఇలాంటివి స‌ర‌దాగా అనిపించ‌వు
మ‌హేశ్ కొత్త‌ లుక్‌ను ఆయ‌న‌ స‌తీమ‌ణి న‌మ్ర‌త శిరోద్క‌ర్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. "కృత్రిమంగా అమర్చేవి (ఈ సంద‌ర్భంలో మీసం) ఎప్పుడూ వాస్త‌వికంగా అనిపించ‌వు. ఇలాంటి వాటితో షూటింగ్ చేయ‌డం సౌక‌ర్య‌వంతంగా లేదా స‌ర‌దాగా ఏమీ ఉండ‌దు. కానీ త‌మ‌వైపు నిపుణులు ఉన్న‌ప్పుడు ఈ స‌వాళ్ల‌ను స్వీక‌రించ‌డానికి ఎవ‌రు మాత్రం ఇష్ట‌ప‌డ‌రు" అని రాసుకొచ్చారు. కాగా "స‌రిలేరు నీకెవ్వ‌రు" చిత్రంతో బంప‌ర్ హిట్ అందుకున్న మ‌హేశ్ ప్ర‌స్తుతం ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో "స‌ర్కారు వారి పాట" చేస్తున్నారు. ఇందులో కీర్తి సురేశ్ హీరోయిన్‌గా న‌టిస్తున్నారు. (చ‌ద‌వండి: రాధేశ్యామ్‌ స్టోరీలైన్ తెలిసిపోయింది!)

Advertisement
 
Advertisement
Advertisement