మహేశ్ కుమారుడు గౌతమ్ ఫస్ట్ యాక్టింగ్ వీడియో | Gautam Ghattamaneni Acting Video Latest | Sakshi
Sakshi News home page

నటనతో ఆకట్టుకున్న గౌతమ్.. వీడియో వైరల్

Mar 21 2025 11:07 AM | Updated on Mar 21 2025 11:53 AM

Gautam Ghattamaneni Acting Video Latest

హీరో మహేశ్ బాబు కొడుకు గౌతమ్ (Gautam Ghattamaneni) గురించి చాలామందికి తెలుసు. గతంలో మహేశ్ నటించిన 'వన్ నేనొక్కడినే' మూవీలో చైల్డ్ ఆర్టిస్టుగానూ చేశాడు. రీసెంట్ గా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఈ కుర్రాడు.. న్యూయార్క్ లోని యాక్టింగ్ నేర్చుకుంటున్నాడు. తాజాగా గౌతమ్ యాక్టింగ్ చేసిన ఓ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీలోకి వచ్చేసిన 9 సినిమాలు)

న్యూయార్క్ లోని టిస్క్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ లో యాక్టింగ్ కోర్స్ చేస్తున్నాడు. తాజాగా తన తోటి స్నేహితులతో కలిసి స్కిట్ చేశారు. ఇందులో గౌతమ్.. ఓ అమ్మాయితో కలిసి క్యాండిల్ లైట్ డిన్నర్ చేస్తున్నట్లు కనిపించాడు. తొలుత నవ్వుతూ, తర్వాత కోప్పడుతూ ఎమోషన్స్ బాగానే పలికిస్తున్నట్లు కనిపించాడు.

ఈ వీడియోతో పూర్తి యాక్టింగ్ జడ్జ్ చేయలేం గానీ మహేశ్ బాబు (Mahesh Babu) ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. మరోవైపు సితార (Sitara) ఇప్పటికే డ్యాన్స్ వీడియోలు చేస్తూ పలు యాడ్స్ లోనూ నటిస్తోంది. ఇదంతా చూస్తుంటే మహేశ్ వారసులిద్దరూ త్వరలోనే తెరంగేట్రం చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

(ఇదీ చదవండి: బెట్టింగ్ ప్రమోషన్స్‌: ఒక్కో వీడియోకు ఎంత రెమ్యునరేషన్‌..?)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement