మహేష్‌ ఫస్ట్‌ బ్లాక్‌ బాస్టర్‌కు 21 ఏళ్లు

Mahesh babu 1st Movie As A Hero Rajakumarudu Completes 21 Years - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు హీరోగా నటించిన మొదటి చిత్రం ‘రాజకుమారుడు’ విడుదలై నేటికి (గురువారం) 21 వసంతలు పూర్తి చేసుకుంటోంది. 1999 జూలై 30న విడుదలైన ఈ సినిమా బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అవ్వడమే కాకుండా మహేష్‌కు మంచి పేరును తెచ్చిపెట్టింది. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించిన ఈ సినిమాను వైజయంతి బ్యానర్‌లో అశ్వినీదత్‌ నిర్మించారు. బాలీవుడ్ భామ ప్రీతి జింతా హీరోయిన్‌ నటించిన ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించారు. ప్రకాష్ రాజ్ కీలక పాత్ర పోషించగా, సూపర్ స్టార్ కృష్ణ క్యామియో రోల్ చేయడం విశేషం. కాగా హీరోగా 21 ఏళ్ల కెరీర్ పూర్తి చేసుకున్న మహేష్ ఇప్పటి వరకు 26 సినిమాలు చేశాడు. (టాలీవుడ్‌ టాప్-10 లవింగ్‌ హీరోలు!)

ఈ సందర్భంగా ప్రిన్స్‌ మహేష్‌బాబు ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. తనకు తొలి చిత్రం రాజకుమారుడు హిట్‌ ఇచ్చినందుకు రాఘవేంద్రరావు, చిత్ర యూనిట్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సినిమా అనుభవంతో నటనలో తనెంతో నేర్చుకున్నట్లు వెల్లడించారు. రాఘవేంద్ర రావు, చిత్ర యూనిట్‌తో కలిసిన పనిచేసినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.

ఈ సినిమా ద్వారా ఎన్నో మధుర జ్ఞాపకాలు అందించిన అశ్వినీదత్‌కు చిత్ర బృందానికి రాఘవేంద్రరావు శుభాకాంక్షలు తెలిపారు. మహేష్‌ బాబు తన కెరీర్‌లో ఇంకెన్నో విజయాలు సాధించాలని ఆశీర్వదించారు. ఈ మేరకు సినిమాకు సంబంధించిన కొన్ని ఫోటోలను ట్విటర్‌లో పోస్టు చేశారు. (‘శభాష్‌ సైబరాబాద్‌ పోలీస్‌.. ఎస్‌సీఎస్‌సీ’ )

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top