Vijay Devarakonda Liger Trailer: క్రాస్ బ్రీడ్ సార్ వాడు... ‘లైగర్’ ట్రైలర్ అదిరింది!

రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న లైగర్ ట్రైలర్ వచ్చేసింది. ఈ సినిమా ట్రైలర్‌ని గురువారం ఉదయం మెగాస్టార్ చిరంజీవి, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. మాస్ డైలాగ్స్, భారీ యాక్షన్ సీక్వెన్స్‌తో ట్రైలర్ అదిరిపోయింది. ‘ఒక లైయన్‌కి, టైగర్‌కి పుట్టిండాడు. క్రాస్ బ్రీడ్ సార్ వాడు’ అంటూ సాగే డైలాగ్‌తో ట్రైలర్ మొదలవుతుంది.
బాక్సర్‌గా విజయ్ దేవరకొండ అదరగొట్టేశాడు. ఇందులో విజయ్ నత్తితో సతమతమవుతున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఇక రమ్యకృష్ణ పాత్ర కూడా ఊరమాస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో ఆమె విజయ్‌కి తల్లి పాత్ర పోషించగా, హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తోంది. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ ఆగస్ట్ 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.