క్రాక్‌ ఓటీటీ రిలీజ్‌ వాయిదా?!

Krack OTT Release May Be Postponed To February 9 - Sakshi

డాన్‌ శీను, బలుపు చిత్రాల తర్వాత ముచ్చటగా మూడోసారి కలిశారు గోపీచచంద్‌ మలినేని, రవితేజ. వీరి కలయికలో వచ్చిన తాజా చిత్రం క్రాక్ బాక్సాఫీస్‌ దగ్గర భారీ హిట్‌ అందుకుంది. సినిమా బాగుందని హీరోలు చిరంజీవి, రామ్‌చరణ్‌, దర్శకులు త్రివిక్రమ్‌, సురేందర్‌ రెడ్డి, హరీష్‌ శంకర్‌, అనిల్‌ రావిపూడితో పాటు పలువురు ప్రముఖులు మెచ్చుకున్నారు. సరస్వతి ఫిలిమ్స్‌ డివిజన్‌ బ్యానర్‌పై బి. మధు నిర్మించిన ఈ సినిమా జనవరి 9న రిలీజైంది. 50 కోట్ల క్లబ్‌లో అడుగు పెట్టిన ఈ చిత్రం ఇప్పటికీ వసూళ్లు కురిపిస్తూనే ఉంది. మరోవైపు దీని డిజిటల్‌ రైట్స్‌ నిర్మాత అల్లు అరవింద్‌ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. (చదవండి: బాలీవుడ్‌లోకి క్రాక్.. హీరోగా సోనూసూద్!)

ఇందుకోసం ఆయన ఏకంగా రూ.8 కోట్లకు పైనే చెల్లించినట్లు టాక్‌ వినిపిస్తోంది. పైగా ఈ సినిమాను ఆహాలో రిలీజ్‌ చేసేందుకు జనవరి 29 డేట్‌ను ఫిక్స్‌ చేశారట. అయితే కంటెంట్‌ ఉన్న సినిమా, అందులోనూ కలెక్షన్లు కురిపిస్తుండటంతో ఇప్పుడప్పుడే ఓటీటీ వద్దనుకుంటుందట చిత్రయూనిట్‌. పదిరోజులు ఓటీటీ రిలీజ్‌ను వాయిదా వేయాలని భావిస్తోందట. దీంతో ఇప్పుడే కాకుండా ఫిబ్రవరి 9న క్రాక్‌ను  ఓటీటీలో రిలీజ్‌ చేయమని అల్లు అరవింద్‌ను కోరుతున్నారట. మరి ఈ విన్నపాలకు ఆయన ఏమని స్పందిస్తారో చూడాలి. కాగా ఈ మాస్‌ ఎంటర్‌టైనింగ్‌ సినిమాలో రవితేజ సరసన శృతిహాసన్‌ హీరోయిన్‌గా నటించింది. వరలక్ష్మి శరత్‌ కుమార్‌, సముద్రఖని, మౌర్యానీ కీలక పాత్రలు పోషించారు. (చదవండి: ఆ రోజు రాత్రి నిద్రపట్టలేదు: క్రాక్‌ దర్శకుడు)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top