బాలకృష్ణ వ్యక్తిగత జ్యోతిష్యుడు ‘కొఠారు’ మృతి | Kotaru Satyanarayana Chowdary Passed Away | Sakshi
Sakshi News home page

హీరో బాలకృష్ణ వ్యక్తిగత జ్యోతిష్యుడు ‘కొఠారు’ మృతి

Jan 2 2025 10:56 AM | Updated on Jan 2 2025 11:05 AM

Kotaru Satyanarayana Chowdary Passed Away

నేడు స్వగ్రామం సింగరాజుపాలేనికి భౌతికకాయం

నల్లజర్ల: నాలుగు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడు తున్న సింగరాజు పాలెం సిద్ధాంతి కొఠారు సత్యనారాయణ చౌదరి (75) బుధవారం హైదరాబాదు అపో లో ఆసుపత్రిలో మృతి చెందారు. ఊపిరితి త్తుల ఇన్పెక్షన్‌తో పాటు బీపీ తగ్గిపోవడంతో ఆయన కోలుకోలేకపోయారు. ఆయన భౌతికకాయాన్ని హైదరాబాద్‌ నుంచి సింగరాజు పాలెం తీసుకువస్తున్నారు. గురువారం అంత్యక్రియలు జరుగుతాయని సమీప బంధు వులు తెలిపారు.

 సినీనటుడు బాలకృష్ణకు వ్యక్తి గత జ్యోతిష్యుడిగా చాలాకాలం పనిచేశారు. 2004 జూన్‌ 3వ తేదీన నటుడు బాలకృష్ణ ఇంట్లో జరిగిన కాల్పుల ఘటనలో నిర్మాత బెల్లంకొండ సురేశ్‌తో పాటు సత్యనారాయణ చౌదరి కూడా గాయపడ్డారు. డాక్టర్లు రెండు బుల్లెట్లు తొలగించగా ఇప్పటికీ ఆయన శరీరంలో ఒక బుల్లెట్‌ ఉంది. 

అప్పట్లో ఈ ఉదంతం రాష్ట్రంలో సంచలనం కలిగించింది. రాజకీయ, ఆర్థిక, పారిశ్రామిక, క్రీడా, సినీనటులు తమ సమస్యలపై తరుచూ సత్యనారాయణ చౌదరిని సంప్రదిస్తూ ఉండేవారు. సత్యనారాయణ చౌదరికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement