
ఓటీటీకి మరో హిట్ సినిమా వచ్చేందుకు సిద్ధమైంది. జూలై 18న విడుదలైన కోలీవుడ్ సోషల్ డ్రామా గెవి డిజిటల్ ప్రీమియర్కు వచ్చేస్తోంది. ఈ చిత్రంలో షీలా, జాక్విలిన్ లిడియా ముఖ్య పాత్రల్లో నటించారు. కోలీవుడ్ డైరెక్టర్ దయాలన్ దర్శకత్వం వహించారు. తమిళంలో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఐఎండీబీలో 9.2 రేటింగ్ సాధించింది.
ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ డేట్ను మేకర్స్ ప్రకటించారు. ఈ వినాయక చవితి కానుకగా ఆగస్టు 27న స్ట్రీమింగ్ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ మూవీ సన్ నెక్స్ట్ ఓటీటీలో వచ్చే బుధవారం నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు పోస్టర్ను రిలీజ్ చేస్తూ ఓటీటీ సంస్థ ట్వీట్ చేసింది. న్యాయం కోసం పోరాటం అనే కాన్సెప్ట్‌తో ఈ మూవీని తెరకెక్కించారు. ఈ చిత్రంలో ఆధవన్, చార్లెస్ వినోద్, జీవా సుబ్రమణియన్, గాయత్రి, వివేక్ మోహన్, ఉమర్ ఫరూక్, జగత్రామన్, అభిమన్యు మీనా కీలక పాత్రలు పోషించారు.
Landslides may bury lives, but not courage.
Gevi streams Aug 27 on SunNXT.#Gevi #SunNXT #StreamingFromAug27 #PoliticalDrama #MustWatch #FightForJustice pic.twitter.com/1HhqtYWDhJ— SUN NXT (@sunnxt) August 22, 2025