
దీక్షిత్ శెట్టి, శశి ఓదెల, యుక్తీ తరేజా లీడ్ రోల్స్‌లో నటిస్తున్న సినిమా ‘కేజేక్యూ: కింగ్ జాకీ క్వీన్’. 1990 నేపథ్యంలో సాగే ఈ పీరియాడికల్ క్రైమ్ డ్రామాకు కేకే దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్‌ఎల్‌వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను హీరో నాని లాంచ్ చేశారు. ‘ఈ సిటీ, గన్ను... రెండూ ఒక్కటే. యవ్వని చేతిలో ఉండతో వాని మాట వింటది’, ‘మగాడు గెలుచుకుంటాడు. కానీ వాడు లాక్కుంటాడు. మరి... నువ్వేంటి?’ ‘పెద్దదైనా చిన్నదైనా రిస్క్ ఒక్కటే... చేసేదేదో పెద్దగా చేద్దాం... వాళ్లో.. మనమో...’ అనే డైలాగ్స్ టీజర్‌లో ఉన్నాయి.
రాజు పాత్రలో దీక్షిత్ శెట్టి, క్వీన్‌గా యుక్తీ తరేజా, జాకీ ΄ాత్రలో శశి ఓదెల నటించారు. అనంతరం హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్‌లో దీక్షిత్ శెట్టి మాట్లాడుతూ– ‘‘నాలో ఉన్న ప్రతిభను ్ర΄ోత్సహిస్తూ, నన్ను స΄ోర్ట్ చేస్తున్న తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాం’’ అని తెలి΄ారు. ‘‘దీక్షిత్, శశి నాకు మంచి మిత్రులై ΄ోయారు. ఈ సినిమాకి మీ అందరి సపోర్ట్ కావాలి’’ అని చెప్పారు యుక్తీ తరేజా.
‘‘ఈ సినిమా చాలా ఎగ్జైటింగ్‌గా ఉంటుంది’’ అని పేర్కొన్నారు శశి. ‘‘ఈ సినిమా గురించి చెప్పడం కంటే మీరు (ఆడియన్స్) చూస్తేనే బాగుంటుందని నా ఫీలింగ్. సినిమా రిలీజ్ తర్వాత నేను మాట్లాడతాను’’ అన్నారు కేకే. ఛాయాగ్రాహకుడు నాగేశ్ మాట్లాడారు. ఈ సినిమాకు సంగీతం: పూర్ణచంద్ర తేజస్వి.