'ఎందుకు టచ్ చేస్తున్నారో ఈజీగా తెలిసిపోతుంది'.. ఆసక్తిగా సాంగ్ ప్రోమో

Kiran Abbavaram Movie Vinaro Bhagyamu Vishnu Katha second single promo - Sakshi

కిరణ్ అబ్బవరం, కశ్మీర జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘వినరో భాగ్యము విష్ణు కథ’. మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై   తెరకెక్కిస్తున్నారు. బ‌న్నీ వాసు  నిర్మాత‌గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి స‌హ నిర్మాత‌గా బాబు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. తిరుమల తిరుపతి నేపథ్యంలో తెరకెక్కుతోన్నఈ సినిమాతో ముర‌ళి కిషోర్ అబ్బురు ద‌ర్శ‌కుడిగా తెలుగు ఇండస్ట్రీకి ప‌రిచయం అవుతున్నారు. ఇప్పటికే  రిలీజైన టీజర్‌, సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. 

తాజాగా ఈ చిత్రం సెకెండ్ సింగిల్ ప్రోమోను విడుదల చేసింది చిత్రబృందం.ఈ పూర్తి పాటను జనవరి 19న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ చేస్తున్న ఈ సినిమాకు విశ్వాస్ సినిమాటోగ్రఫీ, చైతన్ భరద్వాజ్ సంగీతమందిస్తున్నారు. ఈ సినిమా 2023 ఫిబ్రవరి 17న విడుదల చేయనున్నట్లు తెలిపారు. త్వ‌ర‌లోనే ఈ చిత్రానికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు అధికారికంగా ప్రకటించనున్నారు. 

మరిన్ని వార్తలు :

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top