
కోవిడ్ దెబ్బకు కుదేలైన సినిమా పరిశ్రమకు ఆర్‌ఆర్‌ఆర్ వంటి సినిమాలు జోష్ తీసుకొచ్చాయని బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ అంటున్నాడు. థియేటర్లకు తరలివస్తున్నట్టు ఆర్‌ఆర్‌ఆర్ నిరూపించడంతో తాము కూడా హుషారుగా రంగంలోకి దిగుతున్నామని తమ ధర్మ ప్రొడక్షన్స్ నుంచి మరిన్ని భారీ చిత్రాలను ప్రేక్షకులు ఆశించవచ్చునని ‘కూ’ యాప్ వేదికగా బాలీవుడ్ చిత్రాభిమానులకు తీపి కబురు అందించాడు. ఈ మేరకు ఆయన కూ ద్వారా ఒక వీడియో కూడా పంచుకున్నాడు.
నిశ్చలంగా మారిపోయిన ప్రపంచాన్ని థ్రిల్, యాక్షన్, రొమాన్స్ వంటి కధాంశాలు కదిలిస్తున్నాయని కరణ్ జోహార్ అభిప్రాయపడ్డాడు. కరణ్ జోహార్ నిర్మాతగా రూ.150కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కుతున్న బ్రహ్మాస్త్ర ఈ ఏడాది సెప్టెంబరు నెలలో విడుదల కానుంది. ఇందులో టాలీవుడ్ కింగ్ నాగార్జున కూడా నటించారు. అలాగే రాకీ ఔర్ రాణీకీ ప్రేమ్ కహానీని కూడా కరణ్ రూపొందిస్తున్నాడు.