
కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర అభిమానులకు విజ్ఞప్తి చేశారు. దయచేసి ఎవరూ కూడా నా ఫోన్ నుంచి కాల్ వస్తే స్పందించవద్దని కోరారు. తన ఫోన్ హ్యాక్ చేశారని ఉపేంద్ర తెలిపారు. తన భార్య ఫోన్ నుంచి కూడా కాల్ చేసి డబ్బులు అడిగితే ఎవరూ కూడా ఇవ్వొద్దని తెలిపారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ వీడియోను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
ఇప్పటికే దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఉపేంద్ర వెల్లడించారు. తన భార్య ప్రియాంక ఆర్డర్ చేసిన వస్తువుకు సంబంధించి సోమవారం ఉదయం ఒకరు కాల్ చేశారని.. కొన్ని హ్యాష్‌ట్యాగ్స్, నంబర్లు ఎంటర్ చేస్తే డెలివరీ అవుతుందని చెప్పాడని ఉపేంద్ర అన్నారు. ఆ కాల్ తర్వాతే ఫోన్ హ్యాక్ అయిందని తెలిపారు. ఇలాంచి సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఉపేంద్ర తన అభిమానులకు సూచించారు
Beware… pic.twitter.com/ftbQDFodTf
— Upendra (@nimmaupendra) September 15, 2025