విషాదం: ప్రముఖ నటుడు దుర్మరణం | Sakshi
Sakshi News home page

విషాదం: ప్రముఖ నటుడు దుర్మరణం

Published Fri, Dec 25 2020 7:51 PM

Kammatipadam fame Malayalam actor Anil P Nedumangad drowns - Sakshi

2020 భారతీయ సినీ పరిశ్రమలో తీరని విషాదాన్ని మిగిల్చింది. రెండురోజుల క్రితం దర్శకుడు షానవాజ్‌ మరణం నింపిన విషాదాన్నుంచి ఇంకా తేరుకోక ముందే మలయాళ మూవీకి సంబంధించి మరో షాకింగ్‌ న్యూస్‌ అభిమానులను కలవరుస్తోంది. ప్రముఖ నటుడు అనిల్ పీనేదుమంగాడ్  అనుకోని ప్రమాదంలో  ప్రాణాలు కోల్పోయారు. అనిల్  శుక్రవారం సాయంత్రం  కేరళలోని ఎర్నాకుళం జిల్లాలోని మువత్తుపుళం మలంకర డ్యామ్‌లో ప్రమాదవశాత్తు మునిగి కన్నుమూశారు.  ప్రాథమిక సమాచారం  ప్రకారం సాయంత్రం నేడు  స్నేహితులతో కలిసి స్నానం చేస్తుండగా ఈ విషాదం చోటు చేసుకుంది.  పృథ్వీరాజ్‌, దుల్కర్‌ సల్మాన్‌ సహా, మలయాళ చిత్రపర్రిశమ ప్రముఖులు  అనిల్‌ అకాల మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. (సినీ పరిశ్రమలో విషాదం : క్రిస్మస్‌ స్టార్ కడుతూ)

ఇలక్కీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నీటిలో మునిగి అనిల్ ప్రాణాలు కోల్పోయారు. తన స్నేహితులతో కలిసి ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు  ప్రమాదం సంభవించిందనీ, వెంటనే ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లినా  ఫలితం లేకపోయిందని ముట్టం పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. కాగా తిరువనంతపురానికి చెందిన అనిల్ ‘కమ్మతిపాడమ్ మూవీతో ఫ్యామస్‌ అయ్యారు. ఆ తరువాత రాజీవ్ రవి చిత్రం కమ్మట్టిపాడోమ్‌లో విలన్‌గా,  మలయాళ సూపర్‌హిట్‌ మూవీ అయ్యప్పనమ్ కోషియమ్‌లో పోలీసు అధికారిగా అద్భుతమైన నటనతో పేరు తెచ్చుకున్నారు. ఇంకా పావడ, కమ్మట్టి పాదం, కిస్మత్, పెరోల్ చిత్రాల్లో కూడా ఆయన తనదైననటనతోఆకట్టుకున్నారు. మరోవైపు యాదృచ్చికంగా మరణించడానికి కొన్ని గంటల ముందు అనిల్‌ ఫేస్‌బుక్‌లో ఒకపోస్ట్‌ పెట్టారు. ఈ ఏడాది జూన్‌లో మరణించిన అయ్యపనమ్ కోషియం దర్శకుడు సచి లేదా కె.ఆర్ సచిదందన్‌ను తలుచుకుంటూ.. నేను చనిపోయేవరకు మీరు నా ఎఫ్‌బి కవర్ ఫోటోలో ఉంటారంటూ  ఫేస్‌బుక్‌లో రాశారు. దీంతో అనిల్‌ అభిమానులు మరింత విషాదంలో మునిగిపోయారు. అంతకుముందు ప్రముఖ మేకప్ మ్యాన్‌, మలయాళ హీరో నివిన్‌ పాలీ వ్యక్తిగత మేకప్‌ ఆర్టిస్ట్  దుర్మరణం ఇండస్ట్రీలో విషాదాన్ని నింపిన సంగతి తెలిసిందే. (ఎన్నో జ్ఞాపకాలు మిగిల్చి వెళ్లిపోయావు)

Advertisement
 
Advertisement
 
Advertisement