అఫీషియల్: లక్ అంటే జాన్వీదే.. పాన్ ఇండియా క్రేజీ మూవీలో కన్ఫర్మ్ | Janhvi Kapoor Confirms In Ram Charan New Movie Latest Update | Sakshi
Sakshi News home page

Janhvi Kapoor: జాన్వీ, బోనీ కపూర్ కాదు అఫీషియల్‌గా ప్రకటించారు!

Mar 6 2024 9:48 AM | Updated on Mar 6 2024 10:00 AM

Janhvi Kapoor Confirms In Ram Charan New Movie Latest Update - Sakshi

అతిలోక సుందరి శ్రీదేవి కూతురిగా జాన్వీ కపూర్ అందరికీ తెలుసు. హీరోయిన్‌గా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఈమె.. చెప్పుకోదగ్గ రీతిలో సినిమాలేం చేయలేకపోయింది. కొన్ని మూవీస్ అయితే నేరుగా ఓటీటీలో రిలీజైపోయాయి. కానీ ఈ ఏడాది మాత్రం జాన్వీ దశ తిరిగేలా కనిపిస్తోంది. తాజాగా మరో క్రేజీ పాన్ ఇండియా క్రేజీ సినిమాలో హీరోయిన్‌గా కన్ఫర్మ్ అయింది.

(ఇదీ చదవండి: హీరో బాలకృష్ణ నిజ స్వరూపాన్ని బయటపెట్టిన తమిళ స్టార్ డైరెక్టర్)

ఎన్టీఆర్ 'దేవర'లో హీరోయిన్‌గా చేస్తున్న జాన్వీ కపూర్.. ఈ సినిమాపై బోలెడన్ని ఆశలు పెట్టుకుంది. ఇది హిట్ అయితే మాత్రం మరిన్ని మూవీస్‌లో అవకాశాలు ఈమెకి వస్తాయి. ఏప్రిల్‌లోనే రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం.. ఏకంగా అక్టోబరుకు వాయిదా పడింది. దీంతో జాన్వీ అప్పటివరకు ఎదురుచూడక తప్పని పరిస్థితి. అయితే ఈ మూవీ విడుదల కాకుండానే రామ్ చరణ్-బుచ్చిబాబు మూవీలో జాన్వీ ఛాన్స్ కొట్టేసింది.

కొన్నిరోజుల ముందు జాన్వీ తండ్రి, ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ ఈ విషయాన్ని చెప్పారు. ఇప్పుడు అదే విషయాన్ని జాన్వీ పుట్టినరోజు సందర్భంగా అధికారికంగా ప్రకటించారు. పోస్టర్ రిలీజ్ చేసి బర్త్ డే విషెస్ చెప్పారు. 'ఆర్ఆర్ఆర్'తో వేరే లెవల్ క్రేజ్ తెచ్చుకున్న చరణ్, తారక్ లేటెస్ట్ చిత్రాల్లో జాన్వీ హీరోయిన్‌గా చేయడం నిజంగా లక్ అనే చెప్పొచ్చు. ఏ మాత్రం క్లిక్ అయినా సరే జాన్వీ ఫేట్ మారిపోవడం గ్యారంటీ.

(ఇదీ చదవండి: హీరోగా ఫస్ట్ మూవీ డిజాస్టర్.. కానీ ఇప్పుడు మరో సినిమా!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement