గవర్నర్‌తో విజయ్ భేటీ.. 'జన నాయగణ్' నిర్మాత ఎందుకున్నట్లు? | Jana Nayagan Producer Attended TVK Vijay Governor Meeting | Sakshi
Sakshi News home page

TVK Vijay Jana Nayagan: గవర్నర్ దగ్గరకు నిర్మాత కూడా.. ఫొటో వైరల్

May 8 2026 8:16 PM | Updated on May 8 2026 8:22 PM

Jana Nayagan Producer Attended TVK Vijay Governor Meeting

తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా శనివారం ఉదయం 11 గంటలకు విజయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం సాయంత్రం గవర్నర్‌ని కలిసిన విజయ్.. తనకు మెజార్టీ ఎమ్మెల్యేల సపోర్ట్ ఉందని చూపించారు. అయితే విజయ్‌తో పాటు టీవీకే నేతలు కనిపించారు. కాకపోతే 'జన నాయగణ్' నిర్మాత వెంకట్.కె.నారాయణ కూడా ఉండటం ఆసక్తికరంగా అనిపించింది. ఇంతకీ ఏంటి విషయం?

(ఇదీ చదవండి: మెహర్ రమేశ్ కుమార్తె ఎంగేజ్‌మెంట్.. ఆశీర్వదించిన టాలీవుడ్ ప్రముఖులు)

కెవిఎన్ ప్రొడక్షన్స్ పేరిట 2020లో నిర్మాణ సంస్థని స్థాపించిన వెంకట్ కె నారాయణ.. ప్రస్తుతం 'జన నాయగణ్'తో పాటు చిరంజీవి-బాబీ, టాక్సిక్ తదితర చిత్రాల్ని నిర్మిస్తున్నారు. ఈయనకు నిర్మాణం, డిస్ట్రిబ్యూషన్ తప్పితే రాజకీయంగా ఎలాంటి సంబంధాలు లేవు. అయినా సరే విజయ్‌తో పాటు తమిళనాడు గవర్నర్‌ని కలిసేందుకు వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది.

నిర్మాత వెంకట్ కె నారాయణ కూడా టీవీకే పార్టీలో ఏమైనా భాగమయ్యారా? లేదంటే సాధారణంగానే వెళ్లారా అనేది ప్రస్తుతం సస్పెన్స్. 'జన నాయగణ్' సినిమా లెక్క ప్రకారం ఈ ఏడాది సంక్రాంతికే రావాలి. ఇదే చివరి సినిమా అని విజయ్ ప్రకటించడంతో దీనిపై బోలెడంత బజ్ నెలకొంది. కానీ సెన్సార్ బోర్డ్.. దీన్ని పలు కారణాలు చెప్పి అడ్డుకుంటూ వచ్చింది. ఇప్పుడు విజయ్, ముఖ్యమంత్రి కాబోతున్నాడు కాబట్టి ఇక రిలీజ్‌కి ఎలాంటి అడ్డంకి ఉండకపోవచ్చనిపిస్తోంది. మరి ఈ నెలలోనే ఈ సినిమాని విడుదల చేస్తారా లేదంటే జూన్‌లో థియేటర్లలోకి తీసుకొస్తారా అనేది తెలియాల్సి ఉంది.

తెలుగు సినిమా 'భగవంత్ కేసరి' రీమేకే జన నాయగణ్. హెచ్ వినోద్ దర్శకుడు కాగా పూజా హెగ్డే హీరోయిన్. మమిత బైజు కీలక పాత్ర చేసింది. అనిరుధ్ సంగీతమందించాడు. అయితే ఇప్పటికే సినిమా పైరసీకి గురైంది. చాలామంది సదరు ప్రింట్ చూసేశారు కూడా. అయినా సరే కాస్తోకూస్తో బజ్ ఉందంటే దానికి కారణం విజయ్. ఇప్పుడు సీఎం కూడా అయ్యాడు కాబట్టి రిలీజ్ తర్వాత బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి?

(ఇదీ చదవండి: మహేశ్ తీసిన సినిమాపై 'పెద్ది' ఎఫెక్ట్)

Advertisement
 
Advertisement
Advertisement