ఇంటింటి గృహలక్ష్మి: గన్‌తో నందుకు బెదిరింపులు

Intinti Gruhalakshmi May 7th Episode: Nandu Gets Emotional - Sakshi

మే 7 ఎపిసోడ్‌ ప్రత్యేకం..

ఇంటింటి గృహలక్ష్మి సీరియల్‌లో దివ్య ఆత్మహత్యాయత్నం నందుకు తన భాధ్యతను గుర్తు చేసుకుంది. కన్న కూతురు ఈ పరిస్థికి రావడానికి కారణం ఏంటో అర్థం కాక సైకియాట్రిస్ట్‌ను పిలిపించారు. ఆమె ముందు కూర్చున్న దివ్య తనకు ఈ మధ్య ఓ కల తరచూ వస్తోందని చెప్పింది. అందులో అమ్మానాన్న విడిపోతున్నట్లు కనిపిస్తున్నారని, తాను ఒంటరిని అయిపోతున్నానని వాపోయింది. ఆమె అసలు బాధ అర్థమైన డాక్టర్‌.. మీ దగ్గరే శాశ్వత పరిష్కారం ఉందంటూ నందు దంపతులకు చెప్పి వెళ్లిపోతుంది. మరి నేటి(మే 7) ఎపిసోడ్‌లో ఇంకా ఏమేం జరిగిందో తెలియాలంటే ఇది చదివేయండి..

తన బిడ్డకు అప్పుడే ఇన్ని కష్టాలా అని బాధపడ్డ తులసి, తన కూతురును ఒడిలో పెట్టుకుని తల నిమురుతూ ఆమెకు ధైర్యం నూరిపోసే ప్రయత్నం చేసింది. చదువు ఒకటే లోకం కాకూడదని, అన్నింటిలో ఉండాలని సూచించింది. మనోధైర్యం ఉంటే ఎలాగైనా బతికేయొచ్చంటూ మంచి మాటలు చెప్తూ నిద్ర పుచ్చింది. అనంతరం ఆ గదిలోకి వెళ్లిన నందు తండ్రిగా తాను ఫెయిల్‌ అయ్యానని, అందుకు క్షమించంటూ వేడుకుని విలపించాడు. ఇంతలో అక్కడో డైరీ కనిపించడంతో దాన్ని తీసి చదవడం మొదలు పెట్టాడు.

"డాడీ చాలా మంచివాడు.. కానీ ఈ మధ్య అతడిలో చాలా మార్పులొస్తున్నాయి. అవేవీ నచ్చడం లేదు. ఆయన ఎప్పటిలాగా ఉంటే ఎంత బాగుండో! ఆయన ప్రాముఖ్యతనిచ్చే మనుషులు మారిపోయారు. ఇది ఇంకా బాధగా అనిపిస్తోంది. అమ్మను నాన్నెందుకు దూరం పెడుతున్నారు? వీళ్లిద్దరూ కలిసుంటే ఎంత బాగుంటుంది. మరోవైపు నాన్న ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాడు. అలాంటిది నన్ను మెడిసిన్‌ చదివించేందుకు డబ్బులు కట్టమని ఎలా అడుగుతాను. నాన్నను కష్టపెట్టకూడదు. అందుకే డాక్టర్‌ కోర్స్‌ వదిలేద్దాం అనుకుంటున్నా.." అని డైరీలో రాసుకుంది.

ఇది చదివిన నందు ఆనంద భాష్పాలు కార్చాడు. తనంటే దివ్యకు అంత ఇష్టమా? అని సంతోషించాడు. రెక్కలు ముక్కలు చేసుకునైనా డాక్టర్‌ కోర్సు చదివిస్తాను అని ఆ క్షణమే భీష్మించుకుంటాడు. కేవలం అలా అని ఊరుకోలేదు. ఇంట్లో ఉన్న డబ్బులను కోర్సు కోసం కట్టేందుకు దివ్యను తీసుకుని వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. కానీ ఈ ప్రయత్నాన్ని అడ్డుకునేందుకు శశికళ రంగంలోకి దిగింది. ఏకంగా నందు మీదకే గన్‌ పెట్టి బెదిరించింది. మరి ఆమె ప్రయత్నాన్ని తులసి ఎలా అడ్డుకుంది? దివ్య మెడిసిన్‌ సీటు ఫీజు కట్టిందా? లేదా? అనేది తెలియాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే!

చదవండి: మా నాన్న పిచ్చి వల్ల ఆస్తి పోయింది: అనసూయ

సినీ కవి ఆత్రేయ అసలు పేరు తెలుసా?

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top