లేడీ విలన్‌ కీర్తి చౌదరి గురించి ఈ విషయాలు తెలుసా? | Interesting Facts About Web Star Keerthi Chowdary | Sakshi
Sakshi News home page

Keerthi Chowdary: లేడీ విలన్‌ కీర్తి చౌదరి గురించి ఈ విషయాలు తెలుసా?

Oct 3 2021 12:43 PM | Updated on Oct 3 2021 1:14 PM

Interesting Facts About Web Star Keerthi Chowdary - Sakshi

విలన్స్‌ ట్రెండ్‌ మారుతోంది. భయంకర రూపంతో కాకుండా అందమైన రూపం, ఫ్యాషనబుల్‌ లుక్‌తో ఆకర్షిస్తున్నారు. అటువంటి అందమైన విలన్స్‌ జాబితాలో చేరి అలరిస్తోంది వెబ్‌స్టార్‌ కీర్తి చౌదరి. 

పుట్టింది, పెరిగింది, చదివింది అంతా ఢిల్లీలోనే. అక్కడే ఢిల్లీ యూనివర్సిటీలో డిగ్రీ చేసింది. 

కాలేజీ రోజుల్లోనే మోడలింగ్‌ చేసేది. వివిధ ఫ్యాషన్‌ షోల్లోనూ పాల్గొనేది. 

హీరోయిన్‌ కావాలనే తన కలను నిజం చేసుకునేందుకు, ట్రైన్‌ ఎక్కి ముంబై చేరింది.  

ఒకవైపు మోడలింగ్‌ చేస్తూ, సినిమా అవకాశాల కోసం ప్రయత్నించేది. 

సుమారు రెండు సంవత్సరాల తర్వాత ఆమె ప్రయత్నం ఫలించింది. 2018లో ‘గందీ బాత్‌’ అనే వెబ్‌ సిరీస్‌లో నటించే అవకాశం దక్కింది. అది మంచి విజయం సాధించడంతో సినిమా అవకాశాలు క్యూ కట్టాయి. 

2019లో ‘22 డేస్‌’ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగు పెట్టి, వెంటనే ‘మర్దానీ–2’ సినిమాలో ప్రముఖ నటి రాణీ ముఖర్జీతో పాటు కలసి నటించే చాన్స్‌ కొట్టేసింది. 

వరుస హిట్‌ సినిమాల్లో నటించినా ఆశించిన గుర్తింపు దక్కలేదు. దీంతో బుల్లితెరను ఎంచుకుంది. 

యాంకర్‌గా మారి, పలు టీవీ షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరించింది. 

ప్రస్తుతం జీ టీవీలో ప్రసారమయ్యే ‘హమారీ బహు సిల్క్‌’ సీరియల్‌లో లేడీ విలన్‌గా నటిస్తోంది. 

నా పాత్రను ప్రేక్షకులు విమర్శంచడాన్ని చాలా ఆనందిస్తాను. ఎందుకంటే, నెగెటివ్‌ రోల్‌ దక్కడం ఓ వరం. భిన్నమైన పాత్రలు పోషిస్తేనే పరిపూర్ణమైన నటిగా మారగలం.
– కీర్తి చౌదరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement