క్యాస్టింగ్ కౌచ్.. సినీ ఇండస్ట్రీలో తరచూ వినిపించే పేరు. ఎందరో నటీనటులు దీని బారిన పడినవారే.. అయితే అందరూ దానికి లొంగిపోలేదు. అవకాశాల కోసం నీచమైన పనులు చేయడానికి ఎందరో నిరాకరించారు. తమ ప్రతిభతో ఛాన్సులు సంపాదించుకుని మంచి స్థానాలకు వెళ్లారు. అప్పుడప్పుడూ వారి క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలను సైతం అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.
అయితే ఇటీవల హన్సిక మొత్వానీ కూడా క్యాస్టింగ్ కౌచ్ ఫేస్ చేసిందంటూ ఓ వార్త వైరల్ అయింది. టాలీవుడ్‌లో ప్రముఖ హీరో తనను బాగా ఇబ్బంది పెట్టాడని, అస్తమానం డేట్ వెళ్దాం వస్తావా? అంటూ విసిగించేవాడని, చివరికి అతడికి తగిన విధంగా బుద్ధి చెప్పానని హన్సిక పేర్కొన్నట్లు ఓ వార్త కొద్దిరోజులుగా చక్కర్లు కొడుతోంది. దీంతో అందరూ ఆ టాలీవుడ్ హీరో ఎవరా? అని రకరకాలుగా చర్చించుకుంటున్నారు.
హాట్ టాపిక్‌గా మారిన ఈ వ్యవహారంపై తాజాగా హన్సిక స్పందించింది. 'టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్ ఫేస్ చేశానని నేనెప్పుడు మాట్లాడాను? మీకు తోచింది రాయడం ఆపండి. నిజానిజాలు తెలుసుకోకుండా గుడ్డిగా రాసేయడం ఆపండి. వైరలవుతున్న వార్తలో పేర్కొన్నట్లుగా నేను ఎటువంటి కామెంట్లు చేయలేదు. కాబట్టి దయచేసి పూర్తిగా నిర్ధారించుకున్నతర్వాతే న్యూస్ పబ్లిష్ చేయండి' అని ట్వీట్ చేసింది.
Publications urging you to cross check before picking up random news piece ! Never made this comment that's doing the rounds pls fact check before publishing blindly .
— Hansika (@ihansika) May 23, 2023
చదవండి: నా ఇద్దరు కూతుళ్లు స్వామి నిత్యానందతో... తట్టుకోలేక భార్య చనిపోయింది: నటుడు
Comments
Please login to add a commentAdd a comment