నెగెటివిటీతో మా సినిమాకు ఎలాంటి ఎఫెక్ట్ లేదు: గుంటూరు కారం నిర్మాత | Guntur Kaaram Producer Naga Vamsi Tweet on Negative Comments | Sakshi
Sakshi News home page

Naga Vamsi: ఆ విషయం మరోసారి రుజువైంది: నాగవంశీ

Jan 14 2024 3:08 PM | Updated on Jan 14 2024 3:35 PM

Guntur Kaaram Producer Naga Vamsi Tweet on Negative Comments - Sakshi

టాలీవుడ్ సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు నటించిన చిత్రం గుంటూరు కారం. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో తెరకెక్కించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా థియేటర్లలో రిలీజైంది. తొలిరోజే ఈ చిత్రానికి మిక్స్‌డ్‌ టాక్ వచ్చింది. త్రివిక్రమ్- మహేశ్ కాంబోలో వస్తోన్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఫ్యాన్స్‌లో గుంటూరు కారంపై క్యూరియాసిటీ పెరిగిపోయింది. అయితే కొందరు అభిమానులు మహేశ్‌ బాబు సూపర్‌ హిట్‌ కొట్టారంటూ సెలబ్రేట్‌ చేసుకున్నారు. కానీ మరికొందరు ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేపోయిందని కామెంట్స్ చేశారు.

అయితే ఇప్పటికే గుంటూరు కారంపై వస్తున్న నెగెటివ్ టాక్‌పై నిర్మాత దిల్‌రాజు కూడా స్పందించారు. ఇది వ్యాపారమని.. సినిమా బాగుంటే ప్రేక్షకులు తప్పకుండా అదరిస్తారని అన్నారు. తాజాగా ఈ చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ చేసిన ట్వీట్‌ వైరల్‌గా మారింది. మా గుంటూరు కారం సినిమాకు వందలాది ఫ్యాన్స్‌ నుంచి పాజిటివ్‌ రెస్పాన్స్ వచ్చిందన్నారు. 

ముఖ్యంగా ఫ్యామిలీ, యూత్‌ ఆడియన్స్‌ నుంచి గుంటూరు కారం చిత్రానికి విపరీతమైన స్పందన వచ్చిందని ట్వీట్‌లో రాసుకొచ్చారు. గుంటూరుకారం చిత్రంపై నెగెటివీటి వచ్చినప్పటికీ ఈ సినిమాను చూసి ఎంజాయ్‌ చేసేవారిపై.. అలాగే మూవీ క్వాలిటీపై ఎలాంటి ప్రభావం చూపలేదని అన్నారు. సినిమా విషయంలో చివరికి ఆడియన్స్‌ ఏది నిర్ణయిస్తే అదే జరుగుతుందన్నారు. ఈ విషయం గుంటూరు కారం విషయంలో మరోసారి రుజువైందన్నారు. ఫుల్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన గుంటూరు కారం సినిమాను చూసి ఎంజాయ్ చేయండి అంటూ నాగవంశీ పోస్ట్ చేశారు. కాగా.. ఈనెల 12న రిలీజైన ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. 

Advertisement
 
Advertisement
Advertisement