హీరోగా కమెడియన్‌ కొడుకు..ఫస్ట్‌లుక్‌ వచ్చేసింది.. | Gautham Rajus Son Krishnas Upcoming Movie First Look Released | Sakshi
Sakshi News home page

హీరోగా కమెడియన్‌ గౌతమ్ రాజు తనయుడు..ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌

Sep 24 2021 6:15 PM | Updated on Sep 24 2021 6:22 PM

Gautham Rajus Son Krishnas Upcoming Movie First Look Released - Sakshi

'కృష్ణ రావు సూపర్ మార్కెట్' సినిమా ద్వారా తన నటన తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న కృష్ణ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 2+4=24.  సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా లో కృష్ణ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తుండగా ఈ సినిమా  షూటింగ్ శెరవేగంగా జరుగుతుంది.  ఆర్.పి రామ్ దర్శకత్వంలో సావిత్రి ఫిలిమ్స్ సమర్పణ లో రీల్స్ అండ్ రీల్స్ ప్రొడక్షన్ పతాకం పై నంబిరాజ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

కృష్ణ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా ప్రిన్స్ జోసెఫ్ సంగీతం సమకూరుస్తున్నారు. అరుళ్ మోసెస్ కూర్పు, మహేష్ ఆర్ట్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వర్తించారు. కాగా ఈరోజు ఆయన పుట్టిన రోజు సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసింది చిత్ర బృందం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement