Varsha Bollamma: వర్ష బొల్లమ్మ 'స్వాతిముత్యం' రిలీజ్ డేట్ ఫిక్స్..

Ganesh Varsha Bollamma Swathi Muthyam Release Date Announced: ‘గణేష్‘ హీరోగా ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై యువ నిర్మాత సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం 'స్వాతిముత్యం'. ‘వర్ష బొల్లమ్మ' ఈ చిత్ర కథానాయిక. లక్ష్మణ్.కె.కృష్ణ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కంటెంట్ బలంతో దసరా శుభాకాంక్షలతో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావటానికి విడుదల తేదీ ఖరారు చేస్తూ పోస్టర్‌ను బుధవారం (ఆగస్టు 10) విడుదల చేశారు. "స్వాతిముత్యం" సినిమాను అక్టోబర్ 5 న విడుదల చేస్తున్నట్లుగా చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ అధికారికంగా ప్రకటించారు.
'స్వాతిముత్యం' లాంటి ఓ యువకుడు కథే ఈ చిత్రం. జీవితం, ప్రేమ, పెళ్లి పట్ల, ఆలోచనలు, అభిప్రాయాలు నడుమ అతని జీవిత ప్రయాణం ఎలా సాగిందన్నది ఈ చిత్రం. కుటుంబ సంబంధాలు, భావోద్వేగాలు తప్పనిసరి. ప్రధానంగా ఇవన్నీ వినోదాన్ని పుష్కలంగా పంచుతాయి. సగటు సినిమా ప్రేక్షకుడిని అలరిస్తాయి. ప్రేమతో కూడిన వినోద భరిత కుటుంబ కథా చిత్రం 'స్వాతిముత్యం'. సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ చిత్రంగా 'స్వాతిముత్యం'ను దర్శకుడు లక్ష్మణ్ తీర్చిదిద్దారని యూనిట్ పేర్కొంది.
చదవండి: ఎప్పుడూ మీరే కరెక్ట్.. ప్రతిసారి మాదే తప్పు: తాప్సీ
చీరకట్టులో రమ్యకృష్ణ ఇబ్బందులు.. అయినా ఫొటోలకు పోజులు
గణేష్ , వర్ష బొల్లమ్మ జంటగా జోడీ కట్టిన ఈ చిత్రంలో సీనియర్ నటుడు నరేష్, రావు రమేష్, సుబ్బరాజు, వెన్నెల కిషోర్, సప్తగిరి, హర్ష వర్ధన్, పమ్మి సాయి, గోపరాజు రమణ, శివ నారాయణ, ప్రగతి, సురేఖావాణి, సునయన, దివ్య శ్రీపాద నటిస్తున్నారు.
చదవండి: నా సినిమాను అడ్డుకునేందుకు ప్రయత్నించారు: అమలా పాల్
The date is set!!
A Beautiful tale of our Bhagyalakshmi & Balamurali is ready to take you on a fun & exquisite ride on OCT 5th, in theatres near you! 🤩❤️#SwathimuthyamOnOct5th ✨#Ganesh @VarshaBollamma @Lakshmankkrish2 @mahathi_sagar @dopSURYAA @vamsi84 @adityamusic pic.twitter.com/jFIWocdzmS
— Sithara Entertainments (@SitharaEnts) August 10, 2022
మరిన్ని వార్తలు