'దృశ్యం 3' ట్రైలర్ రిలీజ్.. ఈసారి థ్రిల్‌తో పాటు | Drishyam 3 Movie Trailer | Sakshi
Sakshi News home page

Drishyam 3 Trailer: వరుణ్ శవం ఇందులోనైనా దొరుకుతుందా?

May 9 2026 7:51 PM | Updated on May 9 2026 7:51 PM

Drishyam 3 Movie Trailer

మోహన్ లాల్‌ని ఇప్పటి జనరేషన్‌కి బాగా దగ్గర చేసిన సినిమా 'దృశ్యం'. ఈ ఫ్రాంచైజీలో ఇప్పటికే రెండు భాగాలు వచ్చాయి. సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు లాంగ్ గ్యాప్ తర్వాత మూడో భాగాన్ని రిలీజ్ చేస్తున్నారు. ఈ నెల 21నే మూవీ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇది ఆకట్టుకునేలా ఉంది.

(ఇదీ చదవండి: విజయ్-త్రిష పెళ్లి చేసుకుంటే చూడాలని ఉంది: నటి)

తొలి రెండు భాగాల్లోనూ పోలీసులకు దొరకకుండా తప్పించుకున్న జార్జ్ కుట్టి & ఫ్యామిలీ.. ఈసారి ఎలాంటి ఝలక్స్ ఇవ్వబోతుందనేది చూడాలి. తొలి రెండు భాగాల్లో థ్రిల్ ఎలిమెంట్స్ ఎక్కువ ఉండగా.. ఈసారి మాత్రం ‍థ్రిల్‌తో పాటు డ్రామా ఉండనుందని తెలుస్తోంది. ఈసారి ఇద్దరు జర్నలిస్టుల వల్ల జార్జ్ కుట్టి కేసుని పోలీసులు మళ్లీ ఓపెన్ చేయడం లాంటి సీన్స్ ట్రైలర్‌లో చూపించారు. ఈసారైనా వరుణ్ శవం దొరుకుతుందా లేదా అనేది చూడాలి.

ఈ ఫ్రాంచైజీలో ఇదే చివరి సినిమా. జీతూ జోసెఫ్ దర్శకుడు కాగా మోహన్ లాల్ సరసన మీనా చేసింది. తొలి రెండు భాగాల్ని తెలుగులో వెంకటేశ్‌తో రీమేక్ చేశారు. కానీ మూడో భాగాన్ని చేస్తారా లేదా అనేది క్లారిటీ ఇవ్వలేదు. తెలుగు డబ్బింగ్ ఏమైనా రిలీజ్ చేస్తారా అనేది చూడాలి? హిందీలో మాత్రం అజయ్ దేవగణ్ వేరే కథతో 'దృశ్యం 3' తీస్తున్నాడు. ఈ ఏడాదిలోనే దాని రిలీజ్ ఉండొచ్చు.

(ఇదీ చదవండి: ఓటీటీలో మలయాళ డార్క్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగు రివ్యూ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement