డూప్‌, VFX కాదు.. నిజంగా ధురంధర్‌ హీరోనే! | Dhurandhar 2 Movie Actor Ranveer Singh Underwater Scene Goes Viral | Sakshi
Sakshi News home page

నీటి అడుగుభాగంలో ధురంధర్‌ హీరో సాహసం.. వీడియో వైరల్‌

Mar 21 2026 5:40 PM | Updated on Mar 21 2026 5:58 PM

Dhurandhar 2 Movie Actor Ranveer Singh Underwater Scene Goes Viral

సినిమాలో కాస్త కఠినమైన సీన్లు, యాక్షన్‌ సన్నివేశాలు ఉన్నాయంటే చాలు చాలామంది హీరోలు వారి డూప్‌లతోనే చేయిస్తారు. దర్శకనిర్మాతలు సైతం ముందుజాగ్రత్త కొద్దీ డూప్‌లను పెట్టే సీన్లు పూర్తి చేస్తారు. కొన్ని చోట్లేమో హీరోనే పెట్టి సీన్లు చేసినా.. భారీగా వీఎఫ్‌ఎక్స్‌ వాడతారు. అతడే సాహసాలు చేసినట్లుగా తెరపై మాయ చేస్తారు.

డూప్‌ కాదు
కానీ ధురంధర్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ మాత్రం నిజంగానే సాహసం చేశాడు. డూప్‌, వీఎఫ్‌ఎక్స్‌ జోలికి పోకుండా రియల్‌ స్టంట్‌ చేశాడు. సినిమాలో సీక్రెట్‌ ఏజెంట్‌గా మారేందుకు హమ్జా (రణ్‌వీర్‌ సింగ్‌) కఠోరమైన శిక్షణ తీసుకుంటాడు. అందులో భాగంగానే నీటిలో ఊపిరి బిగపట్టుకుని ఉండేలా సాధన చేస్తాడు. 

కదలకుండా కూర్చున్న హీరో
అందుకోసం నీటి అడుగు భాగంలో కదలకుండా కూర్చుంటాడు. ఈ సీన్‌ను చాలా సహజంగా చిత్రీకరించారు. అందుకు సంబంధించిన మేకింగ్‌ క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటిదాకా అతడి నటనను మెచ్చుకున్న జనం.. ఈ వీడియో చూశాక అతడి అంకితభావాన్ని ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు. నీ కష్టం వృథాకాలేదు, నువ్వు చాలా గ్రేట్‌ యాక్టర్‌ అని కితాబిస్తున్నారు.

సినిమా
సినిమా విషయానికి వస్తే.. 2025 డిసెంబర్‌లో వచ్చిన బ్లాక్‌బస్టర్‌ ధురంధర్‌ మూవీకి సీక్వెల్‌గా ధురంధర్‌ 2 తెరకెక్కింది. రణ్‌వీర్‌ సింగ్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం మార్చి 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆదిత్య ధర్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.240 కోట్లు రాబట్టింది.

 

 

చదవండి: త్వరలో పెళ్లి? తేజ సజ్జా రియాక్షన్‌ ఇదే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement