త్వరలో పెళ్లి? తేజ సజ్జా రియాక్షన్‌ ఇదే! | Teja Sajja Reaction Over Wedding Rumours | Sakshi
Sakshi News home page

త్వరలో పెళ్లి? మొహమాటమే లేదన్న హీరో

Mar 21 2026 3:11 PM | Updated on Mar 21 2026 3:21 PM

Teja Sajja Reaction Over Wedding Rumours

ఇప్పటివరకు తేజ సజ్జాను హీరోగానే చూశాం.. కానీ త్వరలో అతడిని ఓ హోస్ట్‌గానూ చూడబోతున్నాం. బాలీవుడ్‌లో వచ్చిన ద ట్రైటర్‌ షో త్వరలోనే తెలుగులోనూ రానుంది. సెలబ్రిటీలు పాల్గొనే ఈ షోకి తేజ సజ్జా వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని అమెజాన్‌ ప్రైమ్‌ అధికారికంగా వెల్లడించింది.

మొహమాటం లేదు
ఇదిలా ఉంటే తాజాగా ఓ ఈవెంట్‌లో తేజ సజ్జా పెళ్లి వార్తలపై స్పందించాడు. త్వరలోనే నా పెళ్లి జరుగుతుందని ప్రచారం చేస్తున్నారు. అందులో నిజం లేదు. ఏదైనా ఉంటే నేనే చెప్తాను. ఒకవేళ పెళ్లి చేసుకుంటే నిర్మొహమాటంగా సిల్వర్‌ జ్యువెలరీ వేసుకుని మరీ ఆ ఫోటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తాను. ఇకపోతే ఇక్కడ స్వయంవరం జరగడంలేదు, కాబట్టి నా పెళ్లి గురించి చర్చ వద్దు అని చెప్పాడు.

టాలీవుడ్‌లో పెళ్లి సందడి
కాగా ఈ ఏడాది ప్రారంభంలోనే పలువురు సెలబ్రిటీలు పెళ్లిపీటలెక్కారు. విజయ్‌ దేవరకొండ- రష్మిక మందన్నా ఫిబ్రవరి 26న వివాహం చేసుకున్నారు. అల్లు అర్జున్‌ సోదరుడు, హీరో శిరీష్‌ మార్చి 6న పెళ్లి చేసుకున్నాడు. కొంతంకాలంగా ప్రేమలో ఉన్న నయనికా రెడ్డి మెడలో మూడు ముళ్లు వేశాడు. తాజాగా బిగ్‌బాస్‌ బ్యూటీ పునర్నవి భూపాలం కూడా వైవాహిక బంధంలో అడుగుపెట్టింది. అటు బెల్లంకొండ శ్రీనివాస్‌ కూడా ఇటీవలే తనకు కాబోయే భార్యను పరిచయం చేశాడు.

చదవండి: ప్రియుడిని పెళ్లాడిన బిగ్‌బాస్‌ బ్యూటీ పునర్నవి

Advertisement
 
Advertisement
Advertisement