Deepika Padukone Visits Tirupati Temple - Sakshi
Sakshi News home page

Deepika Padukone: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న దీపికా పదుకొనె

Jun 10 2022 10:21 AM | Updated on Jun 10 2022 11:49 AM

Deepika Padukone Visits Tirumala Tirupati Devasthanam - Sakshi

బాలీవుడ్‌ బ్యూటీ క్వీన్‌, స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకొనే కుటుంబ సమేతంగా నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ రోజు ఆమె తండ్రి, మాజీ ఆటగాడు ప్రకావ్‌ పదుకొనె బర్త్‌డే సందర్భంగా కుటుంబంతో కలిసి తిరుమలను సందర్శించారు. శుక్రవారం(జూన్‌ 10) ఉదయం వీఐపీ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

చదవండి: అల్లు అర్జున్‌పై కేసు, తప్పుదోవ పట్టించారంటూ పోలీసులకు ఫిర్యాదు

ఈ సందర్భంగా దీపికాకు ఆలయ ఆధికారులు ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వదించి, తీర్థప్రసాదాలు అందించారు. కాగా ప్రస్తుతం దీపికా పఠాన్‌ మూవీతో బిజీగా ఉన్నారు. ఇందులో ఆమె షారుక్‌ ఖాన్‌ సరసన నటిస్తున్నారు. దీనితో పాటు మరో హాలీవుడ్‌ చిత్రానికి ఆమె గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement