CII Dakshin Summit 2023: చిత్ర పరిశ్రమ సమస్యలను పరిష్కరిస్తాం

CII Dakshin Summit 2023: We will solve the problems of the film industry says Anurag Singh Tagore - Sakshi

– కేంద్ర మంత్రి అనురాగ్‌ సింగ్‌ ఠాగూర్‌

‘‘చిత్ర పరిశ్రమకు చెందిన చిన్న చిన్న సమస్యలను ఈ వేదికపై చెప్పారు. వాటిని పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటాం. పైరసీని అరికట్టే విధంగా నూతన చట్టాన్ని తీసుకొచ్చాం. అదే విధంగా జీఎస్టీ విషయంలో ఒకే పన్ను విధానాన్ని చట్టం చేసే ప్రయత్నం చేస్తున్నాం. చిత్ర పరిశ్రమ సమస్యలను పరిష్కరిస్తాం’’ అని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్‌ ఠాగూర్‌ అన్నారు. సీఐఐ దక్షిణ్‌ సమ్మిట్‌ ముగింపు కార్యక్రమం గురువారం సాయంత్రం చెన్నైలోజరిగింది.

సీఐఐ చైర్మన్  టీజీ త్యాగరాజన్  ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఫెప్సీ అధ్యక్షుడు ఆర్కే సెల్వమణి, నటుడు ధనుష్, నటి శోభన, కమల్‌బాలి తదితరులు పాల్గొన్నారు. ఇందులో ముఖ్య అతిథిగా కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్‌ సింగ్‌ ఠాగూర్‌ పాల్గొన్నారు. కాగా సీఐఐ దక్షిణ్‌ నిర్వాహకులు చిరంజీవికి ఐకాన్  అవార్డును, తమిళ నటుడు ధనుష్‌కు యూత్‌ ఐకాన్  అవార్డును ప్రకటించారు. చిరంజీవి హాజరు కాకపోవడంతో ఆయన అవార్డును సుహాసిని అందుకున్నారు. ఈ వేడుకలో పాల్గొనలేకపోయినందుకు క్షమాపణ తెలుపుతూ చిరంజీవి వీడియోను షేర్‌ చేశారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top