రజనీకాంత్, ధనుష్‌ ఇళ్లకు బాంబు బెదిరింపులు | Bomb hoax at residences of actors Rajini and Dhanush | Sakshi
Sakshi News home page

రజనీకాంత్, ధనుష్‌ ఇళ్లకు బాంబు బెదిరింపులు

Apr 12 2026 4:54 AM | Updated on Apr 12 2026 5:12 AM

Bomb hoax at residences of actors Rajini and Dhanush

పోలీసుల పరుగులు 

అనుమానిత వస్తువులు లభించకపోవడంతో ఊపిరి పీల్చుకున్న పోలీసులు

బెదిరింపేనా.. కుట్ర ఉందా అన్న కోణంలో విచారణ 

తమిళ సినిమా: సినీనటులు రజనీకాంత్, ధనుష్‌ ఇళ్లల్లో బాంబులు పెట్టినట్లు వచి్చ­­న ఫోన్‌ కాల్‌ అలజడి రేపింది. పోలీసులను పరుగులు పెట్టించింది. చివరికి ఎలాంటి అను­మానిత వస్తువులు లభించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఆగంతకుడి నుంచి వచి్చన ఫోన్‌ కాల్‌ బెదిరింపేనా.. కుట్ర ఏమైనా దాగి ఉందా అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలు.. రజనీకాంత్, ధనుష్‌ ఇళ్లల్లో బాంబులు పెట్టినట్టు శనివారం ఉదయం చెన్నై కమిషనర్‌ కార్యాలయం సమీపంలోని పో­లీ­స్‌బూత్‌కు ఫోన్‌ కాల్‌ వచ్చింది. దీంతో తేనాంపేట పోలీసులు, బాంబ్‌ స్క్వాడ్, డాగ్‌ స్క్వాడ్‌తో పోయెస్‌ గార్డెన్‌లోని నటులు రజనీకాంత్, ధనుష్‌ ఇళ్లలో తనిఖీలు చేశారు. వారి ఇళ్లు, పరిసర ప్రాంతాల్లో అనుమానించదగ్గ వస్తువులు ఏమీ లభించలేదు.  బెదిరింపు కాల్‌ చేసిన అగంతుకుడి గురించి దర్యాప్తు చేస్తున్నారు. కాగా నటులు రజనీకాంత్, ధనుష్‌ ఇళ్లలో ఒకేసారి బాంబు బెదిరింపులు రావడం సినీ వర్గాల్లో కలకలం రేపింది.  

Advertisement
 
Advertisement
Advertisement