బిగ్‌బాస్‌ తెలుగు నాన్‌స్టాప్‌లో పాయల్‌ సపోర్ట్‌ ఎవరికో తెలుసా? | Sakshi
Sakshi News home page

Bigg Boss Non Stop: బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌లో పాయల్‌ సపోర్ట్‌ ఎవరికో తెలుసా?

Published Wed, May 18 2022 6:46 PM

Bigg Boss Telugu OTT: Actress Payal Rajput Supports Bindu Madhavi - Sakshi

Bigg Boss Telugu OTT: బుల్లితెరపై ఎంతో ఆదరణ పొందిచి రియాలిటీ షో బిగ్‌బాస్‌. తెలుగులో ఇప్పటికే 5 సీజన్లు పూర్తి చేసుకున్న ఈషో ఓటీటీలోకి కూడా అడుగు పెట్టింది. తొలిసారి ఈ సో బిగ్‌బాస్‌ ఓటీటీ నాన్‌స్టాప్‌ పేరుతో డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో ప్రసారం అవుతుంది. ఓటీటీలో ప్రసారం అవుతున్న ఈ షోకి కూడా మంచి ప్రేక్షక ఆదరణ లభించింది. ప్రస్తుతం ఈ షో చివరి వారానికి చేరుకుంది. బిగ్‌బాస్‌ ఓటీటీ తొలి సీజన్‌ టైటిల్‌ను సొంతం చేసుకునేదెవరో తెలిసేందుకు ఇంకా కొద్ది రోజులే మిగిలి ఉన్నాయి. దీంతో హౌజ్‌లోని కంటెస్టెంట్స్‌ అంతా ఒకరికి ఒకరు గట్టి పోటీ ఇచ్చుకుంటున్నారు. 

చదవండి: Bigg Boss Non Stop: బిగ్‌బాస్‌ గ్రాండ్‌ ఫినాలే, అసలైన పోటీ ఆ ఇద్దరి మధ్యే!

ఈ నేపథ్యంలో బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌లో తన సపోర్ట్‌ ఎవరికో బయటపెట్టింది ఆర్‌ఎక్స్‌ 100 బ్యూటీ పాయల్‌ రాజ్‌పుత్‌. ప్రస్తుతం బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌజ్‌లో బిందు మాధవి, అఖిల్, అరియానా, బాబా భాస్కర్ మాస్టర్, యాంకర్ శివ, మిత్రా శర్మ ఉన్నారు. ఇక శనివారం లోపు టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరూ అనేదానిపై క్లారిటీ కూడా వచ్చేస్తుంది. అయితే ఇదే సమయంలో బయట ఉన్న ఫ్యాన్స్ తమకు నచ్చిన కంటెస్టెంట్స్‌కు సపోర్ట్‌గా నిలుస్తున్నారు. తాజాగా నటి పాయల్ రాజ్‌పుత్ కూడా సోషల్‌ మీడియా వేదికగా బిందు మాధవికి తన మద్దతు తెలిపింది.

చదవండి: సర్కారు వారి పాట విజయంపై సూపర్‌ స్టార్‌ కృష్ణ స్పందన

బిందు మాధవికి ఓటు వేసి గెలిపించాలని తన ఫాలోవర్స్‌ను కోరింది. ఈ మేరకు ఆమె తన ఇన్‌స్టా‍గ్రామ్‌లో బిందు ఫొటోను షేర్‌ చేస్తూ.. ‘నువ్వు టైటిల్‌ గెలవడానికి అర్హురాలివి’ అంటూ బిందుకు సపోర్ట్‌ చేసింది పాయల్‌. అయితే ఇప్పటివరకు బిగ్ బాస్ తెలుగు హిస్టరీలో ఓ అమ్మాయి టైటిల్‌ గెలవలేదు. అయితే బిగ్ బాస్ నాన్ స్టాప్‌లో ట్రోఫీ గెలుచుకునే రేసులో ముందంజలో ఉంది బిందు మాధవి. తన ఆటతీరుతో పాటు బిందు మాధవికి సంబంధించిన ఎన్నో అంశాలు ప్రేక్షకులను ఫిదా చేసేస్తున్నాయి. అందుకే టాప్ 5లో బిందు ఉండాలని చాలామంది కోరుకుంటున్నారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement