Bigg Boss 5 Telugu: మా అమ్మతో రవికి గట్టిగానే ఉంటుంది: మానస్‌

Bigg Boss Telugu 5: Umadevi Fires On Contestants, Maanas Get Upset - Sakshi

పవర్‌ యాక్సెస్‌ సాధించిన సిరి హన్మంత్‌

షణ్నూకు సపర్యలు చేసిన లోబో

ఉగ్రరూపం చూపించిన ఉమాదేవి

Bigg Boss 5 Telugu, September 8th Episode: బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌లో ఆదిలోనే కయ్యానికి కాలు దువ్వుతున్నారు కంటెస్టెంట్లు. ఓవైపు సమస్యలు పరిష్కరించుకుందాం అంటూనే మరోవైపు గొడవలకు దిగుతున్నారు. ఇక అమాయకుడన్న జెస్సీ ఆవేశంతో రెచ్చిపోతుంటే షణ్ముఖ్‌కు ఇప్పుడిప్పుడే స్క్రీన్‌ స్పేస్‌ దొరుకుతోంది. లోబో మరోసారి తన కామెడీతో అందరినీ పొట్టచెక్కలయ్యేలా నవ్వించాడు. ఇంతకీ ఈరోజు ఎవరు పోట్లాడుకున్నారు? నేటి(బుధవారం) ఎపిసోడ్‌ హైలైట్స్‌ ఏంటనేవి చూసేద్దాం..

కాజల్‌ను ఓడించాలని కంకణం కట్టుకున్న హౌస్‌మేట్స్‌
మానస్‌ చెప్పినట్లుగా కాజల్‌ అందరూ పడుకున్నాకే నిద్రించేందుకు రెడీ అయింది. కానీ మిగతా కంటెస్టెంట్లందరూ కాజల్‌ను ఓడించాలని కంకణం కట్టుకున్నారు. ఆ రోజంతా నిద్రపోకూడదని ఫిక్సయ్యారు. ఈ టాస్క్‌ ముందుకు జరగాలంటే అందరూ నిద్రించాల్సిందేనని కాజల్‌ మొత్తుకున్నా అందరూ పడుకునేందుకు ససేమీరా అన్నారు. దీంతో చేతులెత్తేసిన కాజల్‌ తను మాత్రం హాయిగా బెడ్డెక్కి నిద్రపోయింది. దీంతో హౌస్‌లో రెండు మూడు సార్లు అలారమ్‌ మోగింది. ఇక పొద్దున్నే కిచెన్‌లోనూ అంట్లు తోమడం తన వల్ల కాదని, ఇంట్లో కూడా ఆ పని చేయలేదంది. అయితే ఇది బిగ్‌బాస్‌ హౌస్‌ కాబట్టి ఏ పనైనా చేయక తప్పదు.

నేనేమైనా వాళ్లింట్లో పని చేస్తున్నానా? ఏడ్చేసిన లహరి
నేనేదైనా అడిగితే ఎందుకు సరిగా సమాధానం ఇవ్వవని లహరి హమీదాను ప్రశ్నించింది. కానీ హమీదా తనను బేఖాతరు చేస్తూ నా ఇష్టం, నేనిలాగే మాట్లాడతానని దురుసుగా వ్యవహరించింది. ఆమె మాటలకు హర్ట్‌ అయిన లహరి.. నేనేమైనా వాళ్లింట్లో పని చేస్తున్నానా? ఎందుకలా రఫ్‌గా మాట్లాడుతుందంటూ ఏడ్చేసింది. కానీ ఆ తర్వాత లహరి, హమీదా ఇద్దరూ ఒకరికొకరు హగ్గులిచ్చుకుని వారి గొడవకు ఎండ్‌ కార్డ్‌ వేశారు. ఇదిలావుంటే శ్రీరామచంద్ర, హమీదా మధ్య లవ్‌ ట్రాక్‌ మొదలైనట్లు చూపించిన ప్రోమో అంతా వట్టిదేనని రుజువైంది. సాధారణ స్నేహితుల్లా వీరిద్దరూ కాసేపు కబుర్లాడారు. ఆ తర్వాత కాజల్‌.. సింగర్‌ శ్రీరామచంద్రను ఎలాంటి అమ్మాయి నచ్చుతుందని అడగ్గా.. సరదాగా, బబ్లీగా ఉండే అమ్మాయి ఇష్టమని వ్యాఖ్యానించాడు.

షణ్నూకు సపర్యలు చేసిన లోబో
'శక్తి చూపరా డింభకా' టాస్క్‌లో సిరి గెలుపొందగా ఆమె ఇద్దరు ఇంటిసభ్యులను ఎంచుకుంది. వారిలో ఒకరు ఇంకొకరికి వ్యక్తిగత సేవకుడిగా ఉండాల్సి ఉంటుందని బిగ్‌బాస్‌ చెప్పగా సిరి.. షణ్ముఖ్‌ను యజమానిగా, లోబోను సేవకుడిగా సూచించింది. ఇదే విషయాన్ని హౌస్‌మేట్స్‌తో చెప్పింది సిరి. దొరికిందే చాన్స్‌ అనుకున్నాడో ఏమో కానీ వెంటనే లోబోతో మసాజ్‌ చేయించుకున్నాడు షణ్నూ. తర్వాత హౌస్‌మేట్స్‌ను ఇమిటేట్‌ చేయమని అసిస్టెంట్‌ను ఆదేశించాడు. దీంతో రెచ్చిపోయిన లోబో అందరినీ అనుకరిస్తూ కామెడీ చేయడంతో కంటెస్టెంట్లు పడీపడీ నవ్వారు. ఆ తర్వాత ర్యాప్‌ సాంగ్‌ పాడి ఆకట్టుకున్నాడు.

షణ్నూ మీద ప్రతీకారం తీర్చుకుంటానన్న లోబో
ఇక సిరిని పవర్‌ రూమ్‌లోకి పిలిచిన బిగ్‌బాస్‌.. మీకిచ్చిన టాస్క్‌ను సీరియస్‌గా తీసుకోవాల్సి ఉంటుందని వార్నింగ్‌ ఇచ్చాడు. దీంతో మిగతావాళ్లకు కూడా సపర్యలు చేస్తున్న లోబో వెంటనే ఆ పనులను ఆపేసి షణ్నుకు సేవలు చేయడం మొదలుపెట్టాడు. అందులో భాగంగా షణ్ముఖ్‌ బట్టలను కూడా అతడే ఉతకాల్సి వచ్చింది. దీనికి లోలోపలే ఉడుక్కున్న లోబో ఇందుకు తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటానని ప్రతిజ్ఞ పూనాడు.

మా అమ్మ వచ్చినప్పుడు రవికి గట్టిగానే ఉంటుంది: మానస్‌
మానస్‌.. తనను పదేపదే ప్రియాంక సింగ్‌తో ముడిపెట్టడాన్ని ఇబ్బందిగా ఫీలయ్యాడు.  రవి బ్రో బయట యాంకర్‌ కావచ్చు కానీ ఇక్కడ కాదు కదా, మా అమ్మ వచ్చినప్పుడు రవి బ్రోను ఓ రౌండ్‌ వేసుకుంటే అప్పుడే తెలుస్తుందని కాజల్‌తో చెప్పుకొచ్చాడు. ఇక కిచెన్‌లో అప్పుడే మంట మొదలైంది. ఆలూ కూర తనకు వడ్డించకుండా ఫ్రిజ్‌లో పెట్టారని యానీ మాస్టర్‌ మీద మండిపడింది ఉమాదేవి. నేను అడిగినప్పుడు కూర లేదన్నారు, మరి ఇప్పుడెలా ఉందని నిలదీసింది. నేను బిచ్చం అడుక్కోవడానికి రాలేదంటూ ఫైర్‌ అయింది.

ఆలూ కర్రీ పెట్టలేదని శివాలెత్తిన ఉమాదేవి
దీంతో యానీ మాస్టర్‌ సెకండ్‌ తినేవాళ్లకు కూర సరిపోవట్లేదని తానే ఆలూ కర్రీ ఫ్రిజ్‌లో పెట్టానని, కానీ ఆ విషయం మర్చిపోయానని చెప్పింది. ఆమె సమాధానంతో సంతృప్తి చెందని ఉమాదేవి.. అంటే దీనిప్రకారం మొదట కాకుండా సెకండ్‌ తినాలన్నమాట అని వ్యంగ్యంగా కౌంటరివ్వగా.. కలిసి తింటే సరిపోతుందని యానీ చెప్పింది. అయినా రెండు కూరలు ఎందుకు చేసుకోవడం? ఒకటే కూర చేసుకుని తింటే చాలని మండిపడింది. ఉమాదేవి తగ్గేలా లేదని అర్థమైన యానీ మాస్టర్‌ తనే ఓ మెట్టు దిగి సారీ చెప్పడంతో ఆమె కూల్‌ అయిపోయింది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top