భయంతో అవ్వా అంటూ ఏడ్చినంత పని చేసిన గంగవ్వ!

Bigg Boss 4 Telugu: Gangavva Receives Covid Vaccine - Sakshi

సాక్షి, కరీంనగర్‌: బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్లందరినీ తన మాటల గారడీతో హుషారెత్తించింది గంగవ్వ. వయసులో పెద్దదైనా అందరినీ కలుపుకుంటూ, ఆఖరికి వ్యాఖ్యాత నాగార్జునను కూడా అన్న అని పిలుస్తూ ఆప్యాయతగా కబుర్లు చెప్పేది. కానీ పచ్చటి పైర్ల మధ్య జీవిస్తూ మట్టివాసన పీల్చే ఆమెకు అక్కడి ఏసీ వాతావరణం పడక అనారోగ్యం బారిన పడింది. దీంతో హౌస్‌ నుంచి అర్ధాంతరంగా బయటకు వచ్చేసింది. 

ఇక బిగ్‌బాస్‌ తర్వాత మరెంతమందో అభిమానులను సంపాదించుకున్న ఆమె తాజాగా కోవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకుంది. మల్యాలలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం వ్యాక్సిన్‌ తొలి డోసు వేసుకుంది. అయితే వ్యాక్సిన్‌ తీసుకునే సమయంలో చిన్నపిల్లలా భయడుతూ అవ్వా.. అంటూ కేకలు పెడుతూ ఏడిచినంత పని చేసింది. ఇక వ్యాక్సిన్‌ తర్వాత ఆమెకు జ్వరం వచ్చిందని, అంతే కాక ఒళ్లు నొప్పులతోనూ సతమతమవుతోందని గంగవ్వ బాధ్యతలు చూసుకునే శ్రీకాంత్‌ మీడియాకు తెలిపాడు. అయితే వ్యాక్సిన్‌ తర్వాత ఈ లక్షణాలు సాధారణమే కాబట్టి పెద్దగా భయపడాల్సిన పని లేదని చెప్పాడు. ఇప్పుడిప్పుడే ఆమె కోలుకుంటోందన్నాడు. ప్రస్తుతం ఆమె తన పనిని పక్కనపెట్టి విశ్రాంతి తీసుకుంటోందని తెలిపాడు.

చదవండి: గాలి మోటార్‌ ఎక్కి, చక్కర్లు కొట్టిన గంగవ్వ

గంగవ్వకు పట్టగొలుసులు ఇచ్చిన అఖిల్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top