‘మంగళవారం’ టైటిల్‌ ఎందుకు పెట్టామంటే: అజయ్‌ భూపతి | Story Behind Mangalavaram Movie Title - Sakshi
Sakshi News home page

Mangalavaram Movie: ‘మంగళవారం’ టైటిల్‌ ఎందుకు పెట్టామంటే: అజయ్‌ భూపతి

Published Tue, Nov 14 2023 7:14 AM | Last Updated on Tue, Nov 14 2023 8:26 AM

Behind Title Story Mangalavaram Movie - Sakshi

‘‘మంగళవారం’ అంటే మంచిది కాదని ఓ అభిప్రాయం ఉంది. అయితే మంగళవారం చాలా శుభప్రదమైన రోజు. జయవారం అంటారు. గతంలో మనకు ఆ రోజే సెలవు ఉండేది.. బ్రిటీషర్లు వచ్చాక ఆ సెలవుని ఆదివారానికి మార్చారు. ‘మంగళవారం’ టైటిల్‌ ΄పోస్టర్‌ విడుదల చేయగానే సీనియర్‌ డైరెక్టర్‌ వంశీగారు ఫోన్‌ చేసి, ‘చాలా మంచి టైటిల్‌ అజయ్‌. నేను చాలాసార్లు ఆ టైటిల్‌ అనుకుంటే నిర్మాతలు ఒప్పుకోలేదు’ అన్నారు. ఆయన నుంచి ఫోన్‌ రావడం చాలా సంతోషంగా అనిపించింది’’ అని దర్శకుడు అజయ్‌ భూపతి అన్నారు. ΄పాయల్‌ రాజ్‌పుత్, అజ్మల్‌ అమీర్‌ జంటగా నటించిన చిత్రం ‘మంగళవారం’. స్వాతి రెడ్డి గునుపాటి, ఎం.సురేష్‌ వర్మతో కలిసి అజయ్‌ భూపతి ‘ఎ’ క్రియేటివ్‌ వర్క్స్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 17న విడుదలవుతోంది. ఈ సందర్భంగా అజయ్‌ భూపతి చెప్పిన విశేషాలు.

∙‘మహాసముద్రం’ సినిమా చిత్రీకరణలో ఉన్నప్పుడు ‘మంగళవారం’ చిత్రం చేయాలని ఫిక్స్‌ అయ్యాను. కమర్షియల్‌ సినిమాలు ఒక మీటర్‌ మీద వెళతాయి కాబట్టి చేయడం కష్టం కాదు. కానీ, ‘మంగళవారం’ లాంటి చిత్రం తీయడం చాలా కష్టం. డైరెక్షన్‌ అండ్‌ టెక్నికల్‌ వేల్యూస్, ఆర్టిస్టుల యాక్టింగ్‌ వంటివి చాలా ఉంటాయి. అలాగే నటీనటులతో ΄పాటు సాంకేతిక నిపుణులందర్నీ ఒక్క తాటిపైకి తీసుకు రావడం కష్టంగా అనిపించింది. ∙‘మహాసముద్రం’ సమయంలో అదితీరావు హైదరీకి కూడా ‘మంగళవారం’ కథ చెప్పాను.. ఆమె చేస్తానన్నారు. అయితే ఆ తర్వాత ఆమెను నేను సంప్రదించలేదు.

‘మంగళవారం’ కోసం సుమారు 40, 50 మందిని ఆడిషన్‌ చేశా. ఆ తర్వాత ఓ రోజు ‘మనం మళ్లీ సినిమా చేద్దాం’ అంటూ ΄పాయల్‌ నుంచి ఓ మెసేజ్‌ వచ్చింది. ఆ పాత్రకు తను సరిపోతుందా? లేదా అని విజువలైజ్‌ చేసుకున్నాను.. రెండు రోజుల తర్వాత ఫొటోషూట్‌ చేశాం. తను సరిపోతుందని తెలిశాక ఓకే చేశా. ∙‘మంగళవారం’ ఏ స్థాయి సినిమా అని నేను ముందు ఊహించకోకపోతే 20 కోట్లు ఖర్చు పెట్టను. అల్లు అర్జున్‌గారికి ఏడాదిన్నర క్రితమే ఈ కథ చెప్పాను. అందుకే ఆయన ట్రైలర్‌ చూసిన తర్వాత సినిమా ఎలా ఉంటుందో ఊహించి, మాట్లాడారు. మా బ్రదర్‌ సురేష్‌ వర్మ, స్వాతి రెడ్డిగార్లతో కలిసి ఈ సినిమా నిర్మాణంలో భాగమవడం సంతోషంగా ఉంది. ‘మంగళవారం’ సినిమాకు కొనసాగింపు ఉంటుంది’’ అన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement