ఏఆర్‌ రెహమాన్‌, సైరా మళ్లీ కలిసిపోయే ఛాన్స్‌! | AR Rahman, Saira Banu Divorce Lawyer says Reconciliation is still Possible | Sakshi
Sakshi News home page

AR Rahman: రెహమాన్‌- సైరా విడాకులు.. లాయర్‌ కీలక వ్యాఖ్యలు

Published Fri, Nov 29 2024 8:11 PM | Last Updated on Fri, Nov 29 2024 8:16 PM

AR Rahman, Saira Banu Divorce Lawyer says Reconciliation is still Possible

ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌, ఆయన భార్య సైరా భాను విడాకుల వ్యవహారం అభిమానులను షాక్‌కు గురి చేసింది. 29 ఏళ్లు అన్యోన్యంగా ఉన్న ఈ జంట విడిపోవడానికి సిద్ధపడటాన్ని ఆయన ఫ్యాన్స్‌ జీర్ణించుకోలేకపోయారు. ఈ క్రమంలో వీరి విడాకుల కేసు వాదిస్తున్న లాయర్‌ వందన షా.. వీళ్లు మళ్లీ కలిసిపోయే ఛాన్స్‌ ఉందంటూ హింటిచ్చారు. 

సుదీర్ఘ జర్నీ.. మళ్లీ కలిసే ఛాన్స్‌
తాజాగా ఓ ఇంటర్వ్యూలో వందన మాట్లాడుతూ.. వాళ్లది సుదీర్ఘ వైవాహిక జర్నీ.. ఎంతో ఆలోచించుకున్నాకే విడిపోవడానికి సిద్ధపడుంటారు. పిల్లల కస్టడీ ఇంకా నిర్ణయించలేదు. తల్లిదండ్రుల్లో ఎవరితో ఉండాలని డిసైడ్‌ చేసుకున్న హక్కు పిల్లలకు ఉంది. అయినా ఈ దంపతుల మధ్య సయోధ్య కుదిరే అవకాశమే లేదని నేను ఎక్కడా కొట్టిపారేయలేదు అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో రెహమాన్‌ దంపతులు మళ్లీ కలిసుండే అవకాశం ఉందని పలువురూ అభిప్రాయపడుతున్నారు.

కాగా ఏఆర్‌ రెహమాన్‌, సైరా బాను 1995లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఖతీజా, రహీమా, అమీన్‌ అని ముగ్గురు సంతానం. ఈ నెల ప్రారంభంలో రెహమాన్‌, సైరా.. తమ వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నట్లు సోషల్‌ మీడియాలో ప్రకటించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement