Apsara Rani : అప్సర రాణి తలకోన సినిమా ప్రారంభం

Apsara Rani Talakona Movie Launched - Sakshi

నగేష్ నారదాసి దర్శకత్వంలో అప్సర రాణి ప్రధాన పాత్రలో నటిస్తున్న తలకోన సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ  నూతన చిత్ర ప్రారంభోత్సవ వేడుక గురువారం ప్రసాద్ ల్యాబ్‌లో ఘనంగా జరిగింది. ఈ చిత్రానికి గుర్తుందా శీతాకాలం నిర్మాత రామారావు  కెమెరా స్విచ్ ఆన్ చేయగా, ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ ముహూర్తపు షాట్‌కు క్లాప్ కొట్టారు.

ఈ సంద్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో 'తలకోన' చిత్ర దర్శకుడు నగేష్ నారదాసి మాట్లాడుతూ... 'చాలా సినిమాలతో నేను మీకు సుపరిచితమే.. ఇప్పుడు ఈ 'తలకోన' చిత్రంతో మరోసారి మీ ముందుకు వస్తున్నా. క్రైమ్ థ్రిల్లర్‌తో సాగే ఈ కథాంశం మొత్తం ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్‌లో ఉండబోతోంది. ఫారెస్ట్ అనగానే కేవలం ప్రకృతి అందాలే కాదు మరో కోణం కూడా ఉంటుందని ఈ సినిమాలో తెలియజేస్తాం. అలాగే పాలిటిక్స్, మీడియాను సైతం మిక్స్ చేసి చూపిస్తాం. అంతే కాకుండా ప్రకృతిలో ఏమేం జరుగుతాయో తెలిపే ప్రయత్నం కూడా చేశాం. మెయిన్ కథాంశం అయితే తలకోన ఫారెస్ట్‌లోకి కొంతమంది స్నేహితులు వెళ్తారు. ఎంత మంది వెళ్లారు? ఎంతమంది తిరిగొచ్చారు? అనేదే ప్రధానాంశంగా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాగా రూపొందిస్తున్నాము. తలకోన చిత్రాన్ని 20రోజులు హైదరాబాద్‌లో, మరో 20 రోజులు తలకోనలో రెగ్యులర్ షూట్ చేయనున్నాము' అని తెలిపారు.

హీరోయిన్ అప్సర రాణి మాట్లాడుతూ... 'మంచి స్క్రిప్ట్స్‌కు నేను ఫ్యాన్‌ను. తలకోన చిత్రం చేయడానికి అదే కారణం అయ్యింది. మొదటి నుంచి కూడా మంచి స్క్రిప్ట్ ఉన్న కథలనే ఎంచుకుంటున్నాను. అవి నాకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. అలాగే ఈ చిత్రం కూడా విజయంతో పాటు మంచి పేరు ఇస్తుందని ఆశిస్తున్నా' అన్నారు.

చదవండి: ఇప్పుడసలైన మజా, ఆదిరెడ్డి వర్సెస్‌ గీతూ గేమ్‌ స్టార్ట్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top