
టాలీవుడ్ సంక్రాంతి సినిమాలకు ఉండే క్రేజే వేరు. అంతేకాదు ఈ పండుగకు రిలీజ్‌కు పెద్దఎత్తున పోటీ ఉంటుంది. దాదాపు ఏడాది ముందు నుంచే ప్లాన్ చేస్తారు మేకర్స్. సినీ ఇండస్ట్రీలో అంతలా డిమాండ్ ఉన్న ఫెస్టివల్ ఇదొక్కటే. ఇప్పటికే టాలీవుడ్ నుంచి నవీన్ పొలిశెట్టి అనగనగా ఒకరాజు, మెగాస్టార్ చిరంజీవి మనశివశంకర వరప్రసాద్ గారు చిత్రాలు పోటీలో నిలిచాయి. వీటితో పాటు ప్రభాస్ ది రాజాసాబ్, శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి సినిమాలు సైతం పొంగల్ పోటీకి సై అంటున్నాయి. వీటితో పాటు కోలీవుడ్ నుంచి విజయ్ మూవీ జన నాయగన్ సైతం వచ్చే ఏడాది సంక్రాంతికి జనవరి 9న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.
ఇంతలా పోటీ ఉన్న పొంగల్‌కు మరో చిత్రం రిలీజ్ కానుంది. ఇటీవలే మదరాసితో ఆకట్టుకున్న శివ కార్తికేయన్ మూవీ పరాశక్తి సైతం సంక్రాంతి పోటీకి సై అంటోంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ మేకర్స్ రివీల్ చేశారు. వచ్చే ఏడాది పొంగల్ కానుకగా జనవరి 14న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ నిర్మాణ సంస్థ రెడ్ జైయింట్ మూవీస్ ఓ వీడియోను పోస్ట్ చేసింది. దీంతో వచ్చే ఏడాది సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద తెలుగు సినిమాలతో పాటు డబ్బింగ్ చిత్రాలకు సైతం పోటీ తప్పేలా కనిపించడం లేదు. ఇంకా సమయం ఉండడంతో మరిన్ని సినిమాలు వచ్చే ఛాన్స్ కూడా ఉంది.
కాగా.. శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘పరాశక్తి’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ సినిమాకు సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో రవి మోహన్, అథర్వ, శ్రీలీల ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలో శివ కార్తికేయన్ విద్యార్థి సంఘం నాయకుడుగా కనిపించనున్నారని తెలుస్తోంది.
பராசக்(தீ) பரவட்டும்🔥🔥
A stunning ride through history awaits#Parasakthi in Theatres from 14th January 2026@siva_kartikeyan @Sudha_Kongara @iam_ravimohan @Atharvaamurali @gvprakash @redgiantmovies_ @Aakashbaskaran @sreeleela14 @dop007 @editorsuriya @supremesundar… pic.twitter.com/SdgUEdwQCK— Red Giant Movies (@RedGiantMovies_) September 12, 2025