Anchor Rashmi Gautam Fires On Netizen Threatening Comments - Sakshi
Sakshi News home page

Rashmi Gautam: చేతబడి చేయిస్తా, యాసిడ్‌ పోస్తా.. రష్మీపై నెటిజన్‌ ఫైర్‌

Feb 25 2023 3:01 PM | Updated on Feb 25 2023 3:31 PM

Anchor Rashmi Gautam Fires On Netizen Threatening Comments - Sakshi

నీ మీద చేతబడి చేయిస్తా పాపిష్టి దానా.. నువ్వు రోడ్డు మీద తిరగకుండా ఇంట్లో ఉండు. ఆవుల వల్ల యాక్సిడెంట్‌ అవుతాయా? నీ మీద యాసిడ్‌ పోస్తా. వాటి గురించి నీలాంటి పాపిష్టి వాళ్లకి తెలియదు.. నోరు మూసుకుని ఉండు. మొండిగా ప్రవర్తిస్తే కష్టాల్లో పడతావు'

అంబర్‌పేటలో వీధి కుక్కల దాడిలో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే! ఈ ఘటనపై సోషల్‌​ మీడియాలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. యాంకర్‌ రష్మీ గౌతమ్‌ సైతం ఈ దాడిపై ఆవేదన వ్యక్తం చేస్తూనే శునకాలు కూడా మనలాగే ప్రాణులని, వాటికి ప్రత్యేకంగా వసతి కల్పించాలని ట్వీట్‌ చేసింది. ఈ ట్వీట్‌పై నెటిజన్లు భగ్గుమన్నారు. ఏ సందర్భంలో ఏం మాట్లాడాలో కూడా తెలియదా? అని ఆమెను చెడామడా తిడుతున్నారు. అటు రష్మీ కూడా తనపై ట్రోలింగ్‌కు ధీటుగా సమాధానాలిస్తోంది. ఒక నెటిజన్‌ అయితే హద్దు మీరి మరీ ఆమెను తిట్టిపోశారు.

'నీ మీద చేతబడి చేయిస్తా పాపిష్టి దానా.. నువ్వు రోడ్డు మీద తిరగకుండా ఇంట్లో ఉండు. ఆవుల వల్ల యాక్సిడెంట్‌ అవుతాయా? నీ మీద యాసిడ్‌ పోస్తా. వాటి గురించి నీలాంటి పాపిష్టి వాళ్లకి తెలియదు.. నోరు మూసుకుని ఉండు. మొండిగా ప్రవర్తిస్తే కష్టాల్లో పడతావు' అని నోటికొచ్చింది వాగారు. ఈ స్క్రీన్‌షాట్‌ రష్మీ షేర్‌ చేస్తూ.. 'ఈ అకౌంట్‌ అమ్మాయిదో, అబ్బాయిదో తెలియదు కానీ ఆ వ్యక్తి అప్పట్లో నా వయసు గురించి, పెళ్లి గురించి వాగాడు. ఇప్పుడేమో ఏకంగా నా మీదే చేతబడి చేస్తాడంట, నాపై యాసిడ్‌ పోస్తాడని బెదిరిస్తున్నాడు. మరి ఇన్నిమాటలు అన్నందుకు నీపై పోలీసులకు ఫిర్యాదు చేయాలా?' అని ఆగ్రహం వ్యక్తం చేసింది. 

చదవండి: నా బ్రదర్‌ ఎన్టీఆర్‌ అంటూ చరణ్‌ ట్వీట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement