Allu Arjun: కుటుంబంతో మాల్దీవుల్లో వాలిపోయిన అల్లు అర్జున్‌

Allu Arjun Visits Maldives With Wife Sneha Reddy And Kids - Sakshi

కాస్త సమయం దొరికితే చాలు సెలబ్రిటీలు మాల్దీవులు చెక్కేస్తుంటారు. సేద తీరాలన్నా, సెలబ్రేషన్స్‌ చేసుకోవాలన్నా.. దేనికైనా మాల్దీవులే బెస్ట్‌ చాయిస్‌ అంటుంటారు. తాజాగా ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ తన కుటుంబంతో కలిసి మాల్దీవులో వాలిపోయాడు. భార్య స్నేహారెడ్డి, కొడుకు అయాన్‌, కూతురు ఆర్హలతో కలిసి అక్కడ ఎంజాయ్‌ చేస్తున్నాడు. ఈ విషయాన్ని ఆయన భార్య అల్లు స్నేహా సోషల్‌ మీడియాలో వెల్లడించింది.

చదవండి: తన రాజీనామా లేఖలో నాగబాబు సంచలన వ్యాఖ్యలు

ఆర్హ, ఆయాన్‌, బన్నీ స్విమ్మింగ్‌ ఫూల్‌లో సరదాగా ఈత కొడుతున్న వీడియోను స్నేహా తన ఇన్‌స్టాగ్రామ్‌లో.. ‘ఫ్యామిలీ వెకేషన్‌’ అంటూ షేర్‌ చేసింది. దీంతో ప్రస్తుతం బన్ని కుటుంబంతో కలిసి మాల్దీవులో సేదతీరుతున్నాడని స్పష్టమైంది. కాగా ప్రస్తుతం బన్ని నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘పుష్ప’. ఈ మూవీ రెండు భాగాలుగా విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల పుష్ప ఫస్ట్‌ పార్ట్‌ షూటింగ్‌ చివరి దశకు చేరింది. ఈ క్రమంలో బన్నికి కాస్తా విరామ సమయం దొరికరడంతో ఆలస్యం చేయకుండా ఫ్యామిలీతో మాల్దీవులు పర్యటనకు వెళ్లినట్లున్నాడు అంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. కాగా పుష్ప ఫస్ట్‌ పార్ట్‌ డిసెంబర్‌ 17న విడుదల చేయనున్నట్లు మూవీ టీం ప్రకటించింది.

చదవండి: తహశీల్దార్‌ కార్యాలయానికి అల్లు అర్జున్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top