Allu Arjun And Harish Shankar AD Video: మరోసారి జతకట్టిన హరీశ్‌ శంకర్‌-బన్నీ, థాయ్‌లాండ్‌లో షూటింగ్‌..

Allu Arjun Collaborated With Director Harish Shankar for An AD Shoot - Sakshi

దర్శకుడు హరీశ్ శంకర్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన ‘డీజే’ చిత్రం మంచి విజయం సాధించడమే కాదు భారీ వసూళ్లు రాబట్టింది. తాజా వీరిద్దరు మళ్లీ జత కట్టారు. హరీశ్ దర్శకత్వంలో బన్నీ నటించనున్నాడు. దీనికి ప్రముఖ బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ సుదీప్ ఛటర్జీ పని చేశాడు. అయితే, ఇది సినిమా కోసం కాదు. ఓ యాడ్ ఫిల్మ్ కోసం. ఈ యాడ్ త్వరలోనే విడుదల కానుంది. ‘పుష్ప’ మూవీతో పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగిన బన్నీతో తమ బ్రాండ్‌ను ఎండార్స్‌ చేసేందుకు పలు వాణిజ్య సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. 

దీంతో వాణిజ్య సంస్థలు తమ ప్రకటనల్లో నటించాలని కోరుతూ బన్నీని సంప్రదిస్తున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్‌ ప్రముఖ బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా బన్నీ మరో యాడ్‌లో నటించనున్నాడు. అయితే ఇప్పటికీ వరకు స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో బన్నీ పలు ప్రకటనల్లో నటించాడు. ఇప్పుడు తొలిసారి హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఓ వాణిజ్య ప్రకటనలో నటించబోతున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా హరీశ్‌ శంకర్‌ ట్విటర్‌ వేదికగా ప్రకటించాడు. ఇందుకు సంబంధించిన షూటింగ్ థాయ్ లాండ్‌లో జరిగనుందని సమచారం. ఇదిలా  ఉంటే ఇప్పటికే దీనికి సంబంధించిన షూటింగ్‌ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. 

చదవండి: 
బిగ్‌బాస్‌లోకి అలనాటి స్టార్‌ యాంకర్‌! భారీ రెమ్యునరేషన్‌ ఆఫర్‌?
నాకు లైన్‌ వేయడం ఆపు అనన్య.. విజయ్‌ రిక్వెస్ట్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top