Actress Yamini Singh: ఆ స్టార్‌ హీరో నాకు ఫోన్‌ రాత్రికి రమ్మన్నాడు: నటి ఆరోపణలు

Actress Yamini Singh Sensational Comments On Co Actor Pawan Singh - Sakshi

ఓ స్టార్‌ హీరోపై నటి సంచలన వ్యాఖ్యలు చేసింది. భోజ్‌పూరి సూపర్‌ స్టార్‌ పవన్‌ సింగ్‌పై నటి యామిని సింగ్‌ తీవ్ర ఆరోపణలు చేసింది. పవన్‌ సింగ్‌ తనని లైంగికంగా వేధించాడంటూ ఆవేదన వ్యక్తం చేసింది. కాగా భోజ్‌పూరి నటి అయిన యామిని సింగ్‌ అక్కడ స్టార్‌ నటిగా గుర్తింపు పొందింది. ఈ క్రమంలో ఆమె పవన్‌ సింగ్‌ లేటెస్ట్‌ మూవీ బాస్‌లో నటించే చాన్స్‌ అందుకుంది. ఇటీవల సెట్‌పై వెళ్లిన ఈ సినిమాలో ఆమెకు సంబంధించిన పలు సన్నివేశాలను కూడా చిత్రీకరించారు. అయితే సడెన్‌గా ఆమెను ఈ సినిమా నుంచి తొలగించినట్లు ఇటివల వార్తలు వచ్చాయి.

చదవండి: నా పిచ్చికి, బాధకు ఇదే మందు: సమంత ఆసక్తికర పోస్ట్‌

ఆమె తీరు నచ్చకే ఈ సినిమాలో నుంచి తొలగించారంటూ రకరకాలు పుకార్లు వినిపించాయి. తాజాగా తనపై వస్తున్న రూమార్స్‌పై యామిని సింగ్‌ స్పందించింది. ఇటీవల మీడియాతో ముచ్చటించిన ఈ రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. పవన్‌ సింగ్‌తో కలిసి పనిచేయడం తనకు ఇష్టం లేదని, అందుకే ఆ సినిమా నుంచి తప్పుకున్నానని చెప్పింది. ఆయన సినిమాల్లో లేడీ యాక్టర్స్‌కు సరైన పాత్రలు ఉండవని చెప్పింది. అదే విధంగా ‘పవన్‌ సింగ్‌ తన సినిమాలో నాకు అవకాశం ఇచ్చాడని ఇండస్ట్రీలోనే అందరు అనుకుంటున్నారు.

చదవండి: కేజీయఫ్‌ ఓ చెత్త సినిమా: ‘కాంతార’ నటుడు సంచలన కామెంట్స్‌

కానీ అది నిజం కాదు. బాస్‌ సినిమాలో నాకు అవకాశం ఇచ్చింది డైరెక్టర్‌ అరవింద్‌ చౌబే. ఈ సినిమా నుంచి నన్ను ఎవరు తీసేయలేదు. నేనే తప్పుకున్నా. పవన్‌ చాలా మంచి నటుడు అని ఈ సినిమా ముందు వరకు అనుకున్నాను. కానీ అతడు అసలు స్వరూపం తర్వాత బయటపడింది. ఓ రోజు రాత్రి 9 గంటలకు నాకు ఫోన్‌ చేశాడు. ఆటోలో స్టూడియోకు రావాలని చెప్పాడు. అయితే రాత్రి అయ్యింది నేను రాలేనని చెప్పాను. దీంతో అతడు సినిమా చేయాలని ఉందా? లేదా? అని వార్నింగ్‌ ఇచ్చాడు. ఈ చిత్రంలో నువ్వు నటించాలంటే ఇప్పుడు రావాల్సిందే అంటూ బెదిరించాడు. ఇక నేను కాల్‌ కట్‌ చేసి సినిమా నుంచి తప్పుకున్నాను’ అంటూ యామిని చెప్పుకొచ్చింది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top