సినిమాలకు పూర్తిగా గుడ్‌ బై.. నటుడి కామెంట్స్ వైరల్..! | Actress Trisha Krishnan Says God Bye Acting In cinemas | Sakshi
Sakshi News home page

Trisha Krishnan: సినిమాలకు పూర్తిగా గుడ్‌ బై.. నటుడి కామెంట్స్ వైరల్..!

Apr 6 2026 7:16 PM | Updated on Apr 6 2026 7:42 PM

Actress Trisha Krishnan Says God Bye Acting In cinemas

ఇటీవల స్టార్ హీరోయిన్ త్రిష పేరు ఎక్కువగా వినిపిస్తోంది. విజయ్ భార్య విడాకుల పిటిషన్ దాఖలు చేయడంతో అనూహ్యంగా త్రిష పేరు తెరమీదకొచ్చింది. విజయ్‌తో ఆమెకు రిలేషన్ ఉందని రూమర్స్‌ వినిపించాయి. ఆ తర్వాత వీరిద్దరు ఓ పెళ్లికి హాజరు కావడంతో వాటి మరింత బలం చేకూరింది. ఆ తర్వాత కోలీవుడ్‌లో ఈ టాపిక్‌ మరింత చర్చనీయాంశంగా మారింది.

ఈ సంగతి పక్కన పెడితే తాజాగా కోలీవుడ్ సీనియర్‌ నటుడు, దర్శకుడు చిత్రా లక్ష్మణన్‌ చేసిన కామెంట్స్ హాట్‌ టాపిక్‌గా మారాయి. త్రిష త్వరలోనే సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పనున్నారని మాట్లాడారు. యూట్యూబ్‌ వేదికగా ఓ నెటిజన్‌ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ప్రస్తుతం చిత్రా లక్ష్మణన్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.  అయితే దీనిపై ఇప్పటి వరకు త్రిష టీమ్ నుంచి ఎలాంటి స్పందనైతే రాలేదు. ఇదే నిజమైతే వెండితెరపై త్రిషను చూడాలనుకున్న ఫ్యాన్స్‌కు నిరాశ తప్పేలా లేదు. చిత్ర లక్ష్మణన్‌ చేసిన కామెంట్స్‌ నిజమో కాదో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. 

 

Advertisement
 
Advertisement
Advertisement