ప్రియుడితో బ్రేకప్‌.. హీరోతో డేటింగ్‌..! | Is Actress Tara Sutaria Dating With Aditya Roy Kapur Amid Breakup With Veer Pahariya, Rumours Went Viral | Sakshi
Sakshi News home page

Tara Sutaria: హీరోతో డేటింగ్‌.. టాక్సిక్ బ్యూటీపై రూమర్స్..!

May 3 2026 5:00 PM | Updated on May 3 2026 5:38 PM

Actress Tara Sutaria dating Aditya Roy Kapur after Veer Pahariya Breakup

సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఏదో ఒక రూమర్స్ వినిపిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా డేటింగ్, రిలేషన్ అనే పదాలు ఎక్కువగా వింటుంటాం. తాజాగా బాలీవుడ్‌ బ్యూటీ తారా సుతారియాకు సంబంధించిన ఓ న్యూస్ బాలీవుడ్‌లో హల్‌చల్ చేస్తోంది. ఆమెకు తన బాయ్‌ఫ్రెండ్‌ వీర్ పహారియాతో బ్రేకప్ అయిందని టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై ఇప్పటి వరకు తారా కానీ.. పహారియా కానీ స్పందించలేదు. విడిపోవడంపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు

అయితే అంతలోనే తారా సుతారియాపై మరో రూమర్ వైరల్‌గా మారింది. బాలీవుడ్ హీరో ఆదిత్య రాయ్ కపూర్‌తో ఆమె డేటింగ్‌లో ఉందంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. తాజా నివేదిక ప్రకారం అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రస్తుతం వీరిద్దరు ఒకరినొకరు కలుసుకుంటున్నారని బాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది. దీంతో ఇప్పుడిది బీటౌన్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. కాగా.. గతంలో ఆదిత్య రాయ్ కపూర్‌.. హీరోయిన్‌ అనన్య పాండేతో రిలేషన్‌ కొనసాగించారు. అయితే గతేడాది చివర్లో ముంబైలో జరిగిన కచేరీ వివాదం తర్వాత తారా, వీర్ పహారియాపై బ్రేకర్ రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇక సినిమాల విషయానికొస్తే ఈ బాలీవుడ్ భామ యశ్ చిత్రం టాక్సిక్‌లో కనిపించనుంది. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement