Shrashti Maheshwari Marriage: ఇంజనీర్‌ను పెళ్లాడిన బుల్లితెర బ్యూటీ

Actress Shrashti Maheshwari Gets Married to Engineer Karan Vaidya - Sakshi

'పాండ్యా స్టోర్‌' సీరియల్‌ నటి శ్రష్ఠి మహేశ్వరి పెళ్లి పీటలెక్కింది. ఇంజనీర్‌ కరణ్‌ వైద్యాను పెళ్లాడింది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో జైపూర్‌లో ఘనంగా వీరి వివాహం జరిగింది. జూన్‌ 19న జరిగిన ఈ పెళ్లి విషయాన్ని అభిమానులకు ఆలస్యంగా వెల్లడించింది మహేశ్వరి. తాజాగా తన భర్తతో కలిసి దిగిన ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో ఫ్యాన్స్‌ శుభాకాంక్షలు చెప్తున్నారు.

తాజాగా శ్రష్ఠి మహేశ్వరి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'కరణ్‌ అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. అతడికి, నాకు ఫిబ్రవరిలో నిశ్చితార్థం జరిగింది. అప్పటికీ, ఇప్పటికీ ఏమీ మారలేదు. కరణ్‌తో కలిసి ఆడుతున్నాను, పాడుతున్నాను. నా పెళ్లిని చాలా ఎంజాయ్‌ చేశాను. నా భర్త చాలా రొమాంటిక్‌. అతడిలో నాకదే నచ్చుతుంది. అతడు నన్ను ఎత్తుకుని పెళ్లి మండపంలోకి తీసుకెళ్లాడు. జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభించినందుకు సంతోషంగా ఉంది' అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం భర్త కోసమే పూర్తి సమయం కేటాయిస్తున్న ఆమె ఈ నెలాఖరుకు ముంబై వచ్చి తిరిగి సెట్స్‌లో అడుగుపెడతానంటోంది.

చదవండి: ఓటీటీలో చేయను, ఎప్పటికీ నేను బిగ్‌ స్క్రీన్‌ హీరోనే!
ఓటీటీలో హిట్‌ కొట్టిన అనకాపల్లి డైరెక్టర్‌, ఇంతకీ ఆయనెవరో తెలుసా?

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top